మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలా సందర్భాల్లో టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఘాటు పదజాలంతో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవిలో ఉన్న సమయంలోనే బాబు అనుకూల మీడియా అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో అనిల్ నోటిదురుసుకు మూల్యం చెల్లించుకోక తప్పదా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
టీడీపీ అనిల్ ను టార్గెట్ చేయడం ఖాయమని ఆయన నోటిదురుసుకు టీడీపీ నేతలు సైతం నోటిదురుసుతోనే సమాధానాలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ తరపున గతంలో బలంగా మాట్లాడిన నేతలలో అనిల్ ఒకరు కావడంతో పాటు లోకేశ్ ను టార్గెట్ చేస్తూ కూడా అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. అయితే అప్పుడు దూకుడుగా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు.
 
ఎన్నికల ఫలితాలతో అనిల్ కుమార్ యాదవ్ కు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నోటిదురుసు వల్లే ఓడిపోవడం నిజమైతే తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీకి ఓటమి కొత్త కాదని చాలా సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అనిల్ కుమార్ యాదవ్ పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
అనిల్ కుమార్ యాదవ్ వయస్సు 44 సంవత్సరాలు కాగా చిన్న వయస్సులోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అనిల్ టీడీపీ టార్గెట్ చేయడం ఖాయమని అయితే ఏ విధంగా టార్గెట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉందని తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చినా ఎన్నికల్లో విజయం మాత్రం సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు 6,48,267 ఓట్లు రాగా దాదాపుగా లక్షన్నర మెజారిటీతో నరసరావుపేట ఎంపీగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు గెలిచారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: