ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సైతం ఈనెల 21వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి.. ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికలలో సైతం గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రారంభం రోజున ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల సీనియర్ సభ్యుడిని స్పీకర్గా గవర్నర్ నామినేట్ చేస్తారు. అలాగే స్పీకర్ ఎమ్మెల్యేలతో కూడా ప్రమాణస్వీకారం చేయిస్తారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా టిడిపి నుంచి 135 మంది జనసేన నుంచి 21 వైసీపీ నుంచి 11 మంది బిజెపి నుంచి ఎనిమిది మంది గెలిచారు.


కూటమిలో భాగంగా మూడు పార్టీల నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. వీరంతా కూడా ఈ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నది. ఆ తర్వాత 22వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికి తెలుగుదేశం పార్టీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు వినిపిస్తున్నది. అయితే ఇలాంటి సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు సభలకు వస్తారా రారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైసిపి పక్ష నేతలను సైతం ఎన్నుకోవాల్సి ఉంటుంది.


ఇప్పటివరకు ఆ పార్టీ పక్షనేత పైన స్పష్టత అనేది రాలేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా అందుకోలేకపోయింది వైసీపీ పార్టీ. దీంతో ఎవరిని పెట్టాలని విజయం పైన జగన్ కూడా ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం.ఒకవేళ జగన్ కాకపోతే ఇందులో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ పక్ష నేతగా ఎన్నుకొని అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు అధికారికంగా జగన్ మాత్రం ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదు. వైసీపీ జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ శుక్రవారం సభకు వస్తారా రారా అనే విషయంపై స్పష్టత వస్తుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: