ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీలో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంచలన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో నమ్మే ప్రజల సంఖ్య చాలా తక్కువ. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కారణంగానే ఆ పార్టీని ఏపీ ప్రజలు నమ్మారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 స్థానాల్లో గెలిపించారు, 6 లోక్‌సభ స్థానాలకు గాను 3 స్థానాల్లో బీజేపీకి భారీ విజయాలను కట్టబెట్టారు.

ఢిల్లీలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు పార్టీ టీడీపీ సాధించిన 16 ఎంపీ సీట్లు దోహదపడ్డాయి.  ఆయన తన మద్దతును డిమాండ్లు చేయడానికి ఉపయోగించలేదు. మరిన్ని కేబినెట్ సీట్లు అడగకుండా రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు వదులుకున్నారు. ఇలా పవన్, బాబు బీజేపీకి ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు స్వాగతం పలుకుతూ బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. బీజేపీతో వల్లభనేని వంశీ, విడదల రజినీ చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అంటే పొత్తు స్ఫూర్తికి విరుద్ధంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు బీజేపీ అభయం ఇస్తోందన్నమాట. రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించే కొత్త ప్రభుత్వం నుంచి తమను తాము రక్షించుకోవడానికి వైసీపీ నేతలు బీజేపీలోకి జంప్ చేయవచ్చు. మరింత అవినీతి, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరవచ్చు.

చంద్రబాబు నాయుడు నుంచి అన్ని సహాయాలు చేసిన తరువాత, బీజేపీ నిజాయితీగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ 2014లో లాగా రాజకీయాలు చేస్తే ఈసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బీజేపీ వీటిని పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. పవన్ కూడా మంచిగా ఉంటే మంచిగా ఉంటారు లేదంటే ఆయన కోపానికి బీజేపీ నేతలు మసైపోతారు. అసలే ఈసారి బీజేపీ ముక్కీ ములిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పెద్దగా మెజారిటీ లేదు కాబట్టి ఈసారి బీజేపీ ఏకపక్షం రా ఏ నిర్ణయాలు కూడా తీసుకోలేదు. చంద్రబాబు ఈ పార్టీకి దూరమైతే మోదీ మరిన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయాలను బీజేపీ నేతలు దృష్టిలో పెట్టుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp