వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. అప్పటినుంచి ఆయన పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కుంభకోణాలు జరిగాయని, వాటిపై దర్యాప్తు చేయాలని వివిధ వర్గాల పిలుపునిచ్చాయి. జగన్‌కి క్లోజ్ గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు "దర్శనం టికెట్ల విషయంలో స్కామ్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నాయకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం, వసతి కోసం ప్రత్యేక ప్రవేశం కల్పించడం ద్వారా చాలా డబ్బు ఆర్జించారని ఆరోపణలు ఉన్నాయి.

జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన టీటీడీ మాజీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి వైసీపీ నేతల వినతులను నెరవేర్చేవారట. వెంకటేశ్వర స్వామి దర్శనాలకు ఉన్న డిమాండ్‌ను మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి మాజీ మంత్రి ఆర్‌కె రోజా డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా, టీటీడీ మెంబర్‌గా చెవిరెడ్డి 2023 ఏప్రిల్‌లో జారీ చేసినట్లుగా చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ విమర్శలకు తావిస్తోంది.

బళ్లారి, హైదరాబాద్, రంగారెడ్డి, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, బెంగళూరుకు చెందిన 56 మందికి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో వీఐపీ బసతో పాటు 56 మందికి ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలను ఒకేరోజు ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులకు చెవిరెడ్డి సిఫార్సు చేసినట్లు లేఖలో రాసి ఉంది.

 "ఇది ఒక సారి జరిగిన కార్యక్రమం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించడం చెవిరెడ్డికి ఒక సాధారణ అలవాటు." అని వర్గాలు తెలిపాయి. టీటీడీలో ప్రత్యేక దర్శనం, వసతి కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తుల పేర్లను సిఫారసు చేయడమే కాకుండా, అతని వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ సిఫార్సు లేఖలను లాభాల కోసం విక్రయించి, ప్రజల అవసరాలను దోపిడీ చేసి, భారీగా డబ్బు సంపాదించినట్లు ఆధారాలూ ఉన్నాయట.

ప్రోటోకాల్ ప్రత్యేకతలతో వెంకటేశ్వర స్వామిని తరచుగా దర్శించుకునే రోజాపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ప్రతిసారీ ఆమెతో పాటు కనీసం 100 మంది వచ్చేవారు. రోజా తన అనుచరుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేయడం ద్వారా ప్రోటోకాల్ దర్శనాలను సులభతరం చేసినట్లు సోర్సెస్ సూచించింది. వైసీపీ అధికారం కోల్పోవడంతో, బాబు ప్రభుత్వం ఈ ప్రత్యేక దర్శనాలు, ఇతర ఆరోపించిన స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని భావిస్తోందట.రోజాతో పాటు దర్శనం కోసం వచ్చిన వారందరికీ సంబంధించిన ఆధార్ కార్డుల వంటి రికార్డులు టీటీడీ వద్ద ఉండే అవకాశం ఉంది. వారు ఎవరో, ప్రొటోకాల్ దర్శనం ఎలా పొందారనేది నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp