ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ కూడా టిడిపి అభ్యర్థి 38వేల, మెజారిటీతో సత్యప్రభ గెలుపొందింది. ఈమె గతంలో ఏనాడు కూడా లేని విధంగా అత్యధిక మెజారిటీ సాధించారని చెప్పవచ్చు. మరి ఈమె ఇంత మెజారిటీ రావడానికి కారకులు కూడా వైసిపి వాళ్ళని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతప్రసాద్ ను కాదని వరపుల సుబ్బారావుకు వైసీపీ టికెట్ ఇచ్చారు. ఇదే తరుణంలో రంగంలోకి దిగినటువంటి సుబ్బారావు అల్లుడు ఎమ్మెల్సీ అనంత బాబు  అంతా తానై చూసుకుంటానని చెప్పి మామను ముంచేశాడు. తీరా అక్కడ సుబ్బారావు ఓడిపోయిన తర్వాత కీలక నేతలంతా వచ్చి  అనంత బాబు వల్లే ఇదంతా జరిగిందని ఆయన ముందు మొరపెట్టుకుంటున్నారట. 

ఆయన నియోజకవర్గంలో  అత్యుత్సాహం ప్రదర్శించారని, లోకల్ లీడర్లైన   మమ్మల్ని కాదని  అంతా రంపచోడవరం నుంచి వచ్చిన నేతలే పెత్తనం చేశారని, ఫిర్యాదు చేశారట. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తికి ఇక్కడి రాజకీయాలు, ఏం తెలుస్తాయని ఆయనను అక్కడ ఇన్చార్జిగా పెట్టుకున్నారని సుబ్బారావును కడిగిపారేసారట. అంతేకాకుండా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో  అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇది కూడా ఆయన ఓటమిపై ప్రభావం చూపించిందట. అంతేకాకుండా అనంతబాబు ప్రచారం చేసే సమయంలో కొన్ని ఊర్లలో అడ్డుకున్నారట. అంతేకాకుండా అభ్యర్థి అయినటువంటి సుబ్బారావు కొడుకు కూడా వస్తే, ఆయనకు కూడా నేనున్నాను నీకు ఎందుకు టెన్షన్ అని పక్కకు పంపించేసాడట. ఇలా అన్నీ తానే చూస్తానని చెప్పి చివరికి  వైసీపీని నట్టేట ముంచేశాడు. ఈ విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సుబ్బారావు దగ్గరికి రోజు కొంతమంది వచ్చి రచ్చ చేస్తున్నారట.

 మమ్మల్ని పొలిటికల్ గా చంపేశారు ఏమి చేయలేని నిస్సహాయక పరిస్థితుల్లోకి తీసుకువచ్చారు. అక్కరకు రాని అనంతబాబును తీసుకువచ్చి ఇక్కడ ఉంచి మీకు మీరే ఓటమిని చవిచూశారని అన్నారట. చివరికి సుబ్బారావు కూడా ఆయన నాకు చెప్పింది వేరు, కింద జరిగింది వేరు,  చివరికి నేను ఓడిపోయాను, నా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఆయన కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులతో చెప్పుకుంటున్నారట. అనంత బాబు వల్ల  100% ఓటమి నాకు వచ్చిందని  చివరికి సుబ్బారావు కార్యకర్తలతో చెప్పుకునే పరిస్థితి వచ్చిందట. ఇదివరకు నేను చాలా సార్లు ఓటమి పొందాను కానీ ఏనాడు కూడా నాయకులు వచ్చి నా దగ్గర ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేయలేదు. అనంత బాబు వల్లే నాకు ఇంతటి పరిస్థితి వచ్చిందని, అప్పుడే మీ మాటలు విని ఉంటే నాకు గెలుపు వచ్చేదని అంటున్నారట. ఎలాంటి పట్టు లేనటువంటి సత్యప్రభకు మెజారిటీ వచ్చింది అంటే దానికి ప్రధాన కారకుడు అనంతబాబు అని సుబ్బారావు కూడా గ్రహించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది అని  సుబ్బారావు మరియు వైసిపి నాయకులంతా అనుకుంటున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: