ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సంచలన పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కానీ, పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు అయితే సాధించలేదు. 2014 19లో అద్భుతమైన సీట్ల సాధించినటువంటి బిజెపి ఈసారి విపరీతమైనటువంటి పరాభవాన్ని పొందింది.  చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫిగర్ కూడా తెచ్చుకోలేక సతమతమైంది. చివరికి ఎన్డీఏ కూటమిలోని  టిడిపి మరియు  జెడియు పార్టీలపై ఆధారపడవలసి వచ్చింది. అంతేకాకుండా ఈసారి ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలు 230 సీట్లు సాధించారు. దీని బట్టి చూస్తే మాత్రం బిజెపికి వీరు ఈసారి టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పవచ్చు. 

అలాంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ పలు సంచలమైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ప్రధాని మోడీ నేతృత్వంలోని కూటమిలో విపరీతమైనటువంటి అసూతృప్తి ఉందని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినా కానీ కొందరు నేతలు మాతో టచ్ లో ఉన్నారని రాహుల్ గాంధీ బాంబు పేలిచారు. వారు ఎవరెవరు అనేది బయట పెట్టలేదు. మోడీ ప్రభుత్వం లోని ఎన్డీఏ కూటమి భవిష్యత్తు మనుగడ కోసం విపరీతమైన ఇబ్బందులు పడే అవకాశం ఉందని రాహుల్ గాంధీ తెలియజేశారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి చాలా బలహీనంగా ఉందని, అందులో ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని కూల్ చేయవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిజెపి మత విద్వేషాలని రెచ్చగొడుతూ ఎన్నికల్లో గెలిచిందని, కానీ ఆయన మాటలను ప్రజలు ఈసారి నమ్మలేదని  తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు.  ఎలాంటి వివక్ష లేని పరిస్థితులు ఈసారి ఉండి ఉంటే మాత్రం ఇండియా కూటమి సందేహం లేకుండా విజయం సాధించేదని తెలియజేశారు. ఆయన మతాకుల ప్రాతిపదికన విభజించు పాలించు అనే మతవిద్వేషాలు రెచ్చగొట్టి సీట్లు సాధించాలని తెలిపారు. అలాగే మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టిన ఇండియా కూటమికి ప్రజలు అద్భుతమైన సీట్లు ఇచ్చారని అన్నారు. ఈ విధంగా ఆయన మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అని అనడంతో ఆ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: