ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు రకాల మార్పులు చేర్పులు సైతం చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రభుత్వంలో మొట్టమొదటగా అన్న క్యాంటీన్లను సైతం ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం వల్ల చాలామంది పేదలకు కడుపు నిండుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో భాగంగా పోరపాలక శాఖ మంత్రి నారాయణ ఒక కీలకమైన ప్రకటనను సైతం తెలియజేశారు. వచ్చే మూడు వారాలలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను సైతం ప్రారంభించే విధంగా ప్లాన్ చేశామని తెలిపారు.


సెప్టెంబర్ 21 లోగా 200 లకు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని ఈ నిర్ణయం వల్ల త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కూడా పేదల కోసం అన్న క్యాంటీన్లను మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. అయితే గతంలో అన్నా క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే భోజనం ఇచ్చేవారు. అలాగే టిఫిన్ కూడా అదే రేటుకే ఉండడంతో చాలామంది వెళుతూ ఉండేవారు. ఇప్పుడు కొత్తగా తెరిచే అన్న క్యాంటీన్లలో రేట్లు ఎలా ఉండబోతున్నాయని విషయం పైన చాలామందిలో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇదివరకే రేట్లు ఉంటాయా లేకపోతే సరికొత్త నేపథ్యంలో చంద్రబాబు ఏదైనా ఆలోచించారా అనే విషయం పైన వార్తలు వినిపిస్తున్నాయి.


రెండు పూటలా కేవలం 10 రూపాయలకే కడుపునిండా భోజనం తినవచ్చు.చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్ మొదలైంది అక్కడ టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనం కూడా సపరేట్గా ఐదు రూపాయలకే అందిస్తున్నారు అలాగే జగ్గంపేటలోని టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ కూడా ఈ రోజున ప్రారంభం కాబోతోంది. వచ్చే నెలాఖరిలోపు ఈ అన్నా క్యాంటీన్లను సంబంధించి మూడు పూటల భోజనం కూడా సరఫరా చేసేందుకు ఏజెన్సీలకు సైతం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందట. ఆ తర్వాత ఏజెన్సీలో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే క్యాంటీన్ భవన నిర్మాణాలు అలాగే కొత్త పరికరాలు అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: