•అధికారంలోకి రావడం ఆలస్యం పనులు షురూ..

•రైతుల కోసం నాణ్యమైన విత్తనాల పంపిణీ

•అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న ఎమ్మెల్యే..

(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్  )

చాలా కాలం పాటు ఎమ్మెల్యే పదవి కోసం ఎదురుచూసిన బండారు శ్రావణి.. ఎట్టకేలకు 2024 ఎన్నికలలో శింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈసారి ఎలాగైనా సరే గెలుపొందాలని ప్రచారం చేపట్టిన ఈమె.. అలా ప్రచారంలోకి వచ్చిందో లేదో ఇలా వడదెబ్బ కొట్టి స్పృహ కోల్పోయింది. దీంతో ఈమె ఏం అధికారంలోకి వస్తుంది అంటే చాలామంది విమర్శించారు కూడా.. కానీ ఈమె తరపున ఈమె అక్కను రంగంలోకి దింపి ప్రచారాలు నిర్వహించింది.. పక్క ప్లాన్ తోనే ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది బండారు శ్రావణి.. ఇక మొత్తానికి ఈమె కష్టం ఫలించింది.. వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు పై ఏకంగా 9000 ఓట్ల మెజారిటీతో ఆధిక్యం లోకి వచ్చింది బండారు శ్రావణి.

అయితే బండారు శ్రావణి అలా అధికారంలోకి వచ్చిందో లేదో అప్పుడే పనులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది.. ఇక అందులో భాగంగానే నిన్న.. రెడ్డిపల్లి లో ఉన్న కెవికె ఫారం లో రాత్రి 9 గంటల వరకు అక్కడ జరుగుతున్న పనులను సమీక్షించినట్లు తెలుస్తోంది.. త్వరలోనే రైతులు ఈ సీజన్లో పంట వేయబోతున్న నేపథ్యంలో ఆయా పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను రైతులకు చేర వేయడం లో భాగంగానే ఇలా ఈ ఫారం ను  ఈమె సందర్శించి విత్తనాల నాణ్యతను పరీక్షించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తమకు నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.అంతేకాదు గార్లదిన్నె దగ్గర ఉన్న  పెనకచర్ల డ్యామ్ ను పరిశీలించి అక్కడ  పెండింగ్లో ఉన్న పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకి ఆదేశించారు..


అలాగే తన వద్దకు ఎవరైనా కలవడానికి వస్తే పూల కుండీలకు బదులుగా పెన్,  పుస్తకాలతో రావాలని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా ప్రజల కోసం , యువత కోసం,  విద్యార్థుల కోసం తన వంతు కృషి కచ్చితంగా చేస్తానని హామీ ఇచ్చిన బండారు శ్రావణి.. తన హామీ మేరకు అప్పుడే పనులు చక్కబెట్టేస్తోంది.. ఏది ఏమైనా ఇలాగే మంచి పనులు చేస్తూ అభివృద్ధి చేపడితే మాత్రం కచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: