ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... పాలనపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల పేర్లను మార్చిన చంద్రబాబు నాయుడు.... ఇప్పుడు వాలంటీర్ల పై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ కు అనుకూలంగా... గత ప్రభుత్వంలో పని చేసిన వాలంటీర్ల పై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారట.


అంతేకాదు ఎన్నికల కంటే ముందు కొంతమంది.. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... రాజీనామా చేశారు వాలంటీర్లు. వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా... ఇన్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో... జగన్మోహన్ రెడ్డి మాట విని... ఏపీ వాలంటీర్లు రాజీనామా చేయకూడదని తెలుగుదేశం కూటమి ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న నెల జీతం ఐదు వేల రూపాయలను... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పదివేల రూపాయలకు చేస్తామని  పేర్కొనడం జరిగింది.



అయితే కూటమి నాయకులు చెప్పిన మాటలను వాలంటీర్లు అసలు వినలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వం మారటంతో రాజీనామా చేసిన వాలంటీర్ల... సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు... ఏపీ మంత్రులను కలుస్తూ... తమను విధుల్లోకి మళ్లీ తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే ఛాన్స్ అన్నట్లుగా... ఏపీ ప్రభుత్వం... రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందట.



ఇక ఏపీ మంత్రులు కూడా అదే రీతిలో... రాజీనామా చేసిన వాలంటీర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. తమ వద్దకు వచ్చిన వాలంటీర్లు వెంటనే.... రాజీనామా చేయమని చెప్పిన వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసి...  ఆ తర్వాత విధుల్లో చేరాలని అచ్చం నాయుడు స్పష్టం చేశారు. అప్పుడే.. వారిని విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు... రాజీనామా చేసిన వాలంటీర్లను క్షమించేదే లేదని తేల్చి చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపి.. ఇప్పుడు తమ ప్రభుత్వం లో మళ్లీ పని చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన వెల్లడించారట. దీంతో ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: