ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన తర్వాత ఓటమి పాలైన వైసీపీ నేతలు మీడియా ముందు రావడానికే భయపడుతున్నట్లు అసలు ఎక్కడ కనబడటం లేదు. అయితే ఇపుడిపుడే చిన్నగా అందరు నేతలు మాజీ సీఎం జగన్ ను నిదానంగా కలవడం ప్రారంభించారు. అయితే జగన్ వాళ్లందరికీ పార్టీ భవిష్యత్తు పై కార్యాచరణలు చేసి దిశా నిర్దేశం చేస్తున్నారు.ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిత్యం సమావేశం అవుతున్నారు.ప్రత్యర్థులపై మాటలతో దాడి చేస్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయం లో మధ్య లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓటమి తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. మీడియా తో కూడా మాట్లాడలేదు. తాజాగా జగన్ కలిసేందుకు వచ్చారు.ఈ రోజు మాజీ మంత్రి, నగరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నియోజకవర్గ పరిస్థితిపై అక్కడ పరిణామాలను వారు జగన్ వివరించినట్లు తెలుస్తుంది.వాటన్నింటిని విన్న జగన్ నేతలేవరు అధైర్య పడొద్దని ఈ సందర్భం గా జగన్ వారందరికీ సూచించినట్లు సమాచారం.అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన తమకు మాత్రం నలభై శాతం ఓట్లు ప్రజలు వేశారని మనం ఇంకా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం  ఖాయమని నేతలందరికి జగన్ భరోసా ఇచ్చారు.అయితే రోజా తన ఓటమికి గల కారణాలు జగన్కు వివరించారు.నగరిలో సొంత పార్టీ నేతలే తన ఓటమి కి ప్రయత్నించారని జగన్ కు రోజా  ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనూ రోజా ఈ విషయం పై బహిరంగంగానే చెప్పారు.తాజాగా జగన్ కు ఇదే విషయాన్ని గూర్చి రోజా చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: