ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డిజిపిని తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు. ఏపీ కొత్త డీజీపీగా సిహెచ్ ద్వారా రావును నియామకం చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి ఎండిగా తిరుమల రావు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతన్ని... కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియామకం చేసి... పోలీస్ దళాల అధిపతిగా.. అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది బాబు సర్కార్.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 1989 సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ అధికారైన ద్వారకా తిరుమలరావు.... ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ లిస్టులో టాప్ పొజిషన్లో ఉన్నారు. గతంలో కర్నూలు ఏ ఎస్పీగా, అనంతపురం కడప మెదక్ జిల్లాలకు పూర్తిస్థాయిలో ఎస్పీగా కూడా తిరుమల రావు పనిచేశారు. అంతేకాదు అనంతపురం అలాగే హైదరాబాద్ రేంజ్ లతో పాటు ఎస్ఐబిలో డిఐజిగా కూడా పనిచేశారు తిరుమల రావు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా కూడా ఆయన పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 సంవత్సరం జూన్ నుంచి ఆర్టీసీ ఎండీ గా తిరుమల రావు నియామకమై పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో తిరుమలలో డీజీపీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు.