*డీఎస్సి పై ముందడుగు వేసిన చంద్రబాబు ,రేవంత్ రెడ్డి
*గత ప్రభుత్వాలకు శాపంగా మారిన నిరుద్యోగ సమస్య
*ఈ సారి తప్పిదం జరగకుండా ముందస్తు చర్యలు

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ప్రభుత్వాలు మారడానికి ప్రధాన కారణం నిరుద్యోగం.ఆంధ్ర ,తెలంగాణాలో గత ప్రభుత్వాలు నిరుద్యోగులను అస్సలు పట్టించుకోలేదు.ఇటు కెసిఆర్ అయినా అటు జగన్ అయినా కూడా నిరుద్యోగులకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చి గడిచిన ఐదేళ్ళలో నిరుద్యోగులను నట్టేట ముంచారు.లక్షలాది మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వండి నాయనో అంటూ ధర్నాలు ,ర్యాలీలు చేసిన గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.రాష్ట్ర నిరుద్యోగులతో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లక్షలాది మంది వున్నారు.గత ప్రభుత్వాలు ఉపాధ్యాయ నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సి వేస్తామని ప్రకటించి గడిచిన ఐదేళ్లలో ఈ ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయలేదు.ఎన్నికలు సమీపించిన రెండు మూడు నెలల్లో తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకున్నారు.ఎన్నికలు సమీపించడంతో ఆ పరీక్ష కూడా నిర్వహించలేకపోయారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం నిరంతరం తగ్గడంతో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతున్నాయి.


గత ప్రభుత్వాలు వీటిపై దృష్ఠి పెట్టకపోవడంతో వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దు అయ్యాయి.కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ,చంద్రబాబు ప్రభుత్వాలు అధికారం లోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు.రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలుస్తామని హామీ కూడా ఇచ్చారు.తాజాగా ఈ రెండు ప్రభుత్వాలు భారీగా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసారు.త్వరలోనే డీఎస్సి పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయనున్నారు.అలాగే రాష్ట్రంలో ఖాళీగా వున్నా పోలీస్ ఉద్యోగాలు అలాగే గ్రూప్స్ ఉద్యోగాలు కూడా విడతల వారీగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.అలాగే ప్రయివేట్ ఉద్యోగాల కల్పనలో కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ముందడుగు వేస్తున్నారు.తమ రాష్ట్రాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకోనున్నారు,దీనితో స్థానికంగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.ప్రస్తుతం ఇరు రాష్ట్ర ముఖ్య మంత్రులు నిరుద్యోగం పై పూర్తి దృష్ఠి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: