ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 సీట్లలో భారీ విజయాన్ని చేకూర్చడానికి ముఖ్యంగా రెడ్డి కులస్తులు చాలా సపోర్ట్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వారిని పట్టించుకోలేదని 2024 ఎన్నికలలో చాలామంది ఎగైనెస్ట్ గా ఉన్నారని వార్తలు కూడా వినిపించాయి. ఈ ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం దెబ్బకొట్టేసినట్టు కనిపిస్తోంది. దీంతో కేవలం 11 స్థానాలకె వైసీపీ పార్టీ పరిమితమయ్యింది. ఎన్నో ఏళ్ళుగా కమ్మ సామాజిక వర్గానికి టిడిపి ఓటు బ్యాంక్ అంటిపెట్టుకొని ఉన్నది.



ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన తర్వాత వైసిపి వైపు రెడ్లు రావడం జరిగింది. 2019 ఎన్నికలలో వైసిపి పార్టీ అధికారంలోకి రావడానికి రెడ్లు కీలకమైన పాత్ర వ్యవహరించారు. ఈ ఎన్నికలలో ఆ పార్టీకి చాలా దూరమైనట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజికం ఎక్కువగా ఉండే రాయలసీమ వంటి ప్రాంతాలలో సొంత సామాజిక వర్గం దూరం కావడం చేత వైసిపి పార్టీకి కోలుకోలేన దెబ్బ పడింది. ఏపీలో సుమారుగా 70కి పైగా సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి మంచి పట్టు ఉన్నది. కొన్ని దశాబ్దాలుగా రెడ్ల సామాజిక వర్గమే శాసిస్తోంది.


ఆర్థికంగా బలమైన సామాజిక వర్గంగా కూడా రెడ్డి సామాజిక వర్గం ఉన్నది. ఇదే 2019లో జగన్ను అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది. ఈసారి ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం వారు వైసిపి పార్టీకి మద్దతు ఇవ్వలేదు. దీంతో చాలామంది కీలక నేతలు కూడా ఓడిపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా వైసిపి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా ఎన్నికలలో చాలావరకు తగ్గింది. సంక్షేమ పథకాలతో మిగిలిన వర్గాలు కాస్త దగ్గర అయినప్పటికీ.. రాజకీయంగా కీలకమైనటువంటి వర్గమైన రెడ్లు మాత్రం దూరమయ్యారు. ఈ విషయం ఇప్పుడు ఏపీ పాలిటెక్లో హార్ట్ ఆఫ్రికా ఈ విషయం ఇప్పుడు ఏపీ పాలిటెక్లో హార్ట్ ఆఫ్రికా ఈ విషయం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా కమ్మ సామాజిక వర్గం టిడిపి పార్టీ వైపే ఉన్నది. ముఖ్యంగా 2019లో గెలిచిన తర్వాత రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదని కోపంతో జగన్ని 2024లో వదిలేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజకీయంగా కూడా తమకు పిలువ లేకుండా పోయిందని.. చివరికి వ్యతిరేకించేదాకా వెళ్ళింది. అలాగే సామాజికం అనే పేరుతో రెడ్లకు కాకుండా ఇతర సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టడం కూడా వైసిపి కి మైనస్ గా మారింది. అలాగే కాంట్రాక్టర్లుగా ఉన్న రెడ్లకు బిల్లులు వంటివి అంగీకరించకపోవడం కూడా చాలా నష్టాన్ని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: