ప్రస్తుతం ఏపీలో రుషికొండ భవనాల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. 450 కోట్లు ఖర్చు చేసి.. రుషికొండ భవనాలు కట్టి.. ప్రజాధనం వృధా చేశారని జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే.. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. రుషికొండ భవనాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. జగన్ సొంత భవనాల్లో మాత్రమే ఉంటారు తప్ప ప్రభుత్వ భవనాల్లో ఉండరని.... రుషికొండ భవనాల్లో జగన్ ఉంటారు అని ఎవరు చెప్పారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.


అయితే.. టీడీపీ పార్టీకి కౌంటర్‌ ఇవ్వబోయి..మాజీ పర్యటక శాఖ మంత్రి రోజాను ఇందులో ఇరికించారు కొడాలి నాని. రుషికొండ భవనాలపై  దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రుషికొండ భవనాలు కేవలం టూరిజం శాఖ కోసం మాత్రమే నిర్మించారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అంతర్జాతీయ స్థాయిలో వచ్చే వారి కోసం మాత్రమే వీటిని నిర్మించారని...తెలిపారు. అయితే..రుషికొండ భవనాలు కేవలం టూరిజం శాఖ కోసం మాత్రమే నిర్మించిందని కొడాలి నాని చెప్పడంతో... రోజాను ఇరికించాడని టీడీపీ పార్టీ కౌంటర్‌ ఇస్తోంది.


అయితే... కోడెల అసెంబ్లీలో ఉండే ఫర్నీచర్ ను బైక్ షోరూమ్ లో పెడితే దొంగ అన్నారని... ఫర్నీచర్ ఎంత వ్యయం చెబితే చెల్లిస్తారు, లేకపోతే తీసుకు వెళ్ళిపొండని మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. టీడీపీ ఏం చేస్తారో వాళ్ళు చేతనైంది చేసుకోవచ్చు.... ఎవరిని చంపాలి అనుకుంటున్నారో చంపండి, కొట్టండి కానీ సూపర్ సిక్స్ అమలు చేయండి అంటూ డిమాండ్‌ చేశారు కొడాలి నాని. ఇక ఏపీ వ్యాప్తంగా త్వరలోనే నియోజక వర్గాలలో మాజీ సీఎం జగన్ పర్యటన ఉంటుందని ప్రకటించారు.


త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని జగన్ పరామర్శిస్తారని... నియోజక వర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయని చెప్పారు.  ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని... ఇంత మంచి చేసినా ఓటమి పాలవటం నమ్మశక్యంగా లేదని వివరించారు కొడాలి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని... 1500 మహిళలకు ఫించన్, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అంశాల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: