ఏమిటీ జంతర్ మంతర్ నంబర్లు అని ఆలోచిస్తున్నారా? పైగా వైసీపీకి 15, టీడీపీకి 6 ఏమిటని ఆక్కవుతున్నారా? ఆగండాగండి... ఇవి నంబర్లు కాదు హోదాలు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పాతిక సీట్లకు 16 ఎంపీలు గెలుచుకుని టీడీపీ విజయ దుందుభి మోగించింది. ఇక నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 4 ఎంపీలను మాత్రమే గెలిచి గ్రాఫ్ పోగొట్టుకుంది. ఇక జాతీయ స్థాయిలో చాలా కాలం తరువాత టీడీపీ పసుపు జెండా రెపరెపలాడుతోంది. తాజాగా జరిగిన 18వ లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ మంచి నంబర్ ని సాధించి పార్లమెంట్ లోకి సింహంలాగా అడుగుపెడుతోంది.

240 ఎంపీలను గెలుచుకున్న బీజేపీ సహజంగానే టాప్ ప్లేస్ లో ఉంటుంది. రెండో ప్లేస్ లో 99 ఎంపీలు సాధించిన కాంగ్రెస్ ఉండనే ఉంది. అలాగే 3వ ప్లేస్ విషయానికొస్తే 37 మంది ఎంపీలను గెలుచుకుని సమాజ్ వాదీ పార్టీ తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. అదే విధంగా 29 ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ నాలుగో ప్లేస్ కొట్టేసింది. అదే విధంగా 22 మంది ఎంపీలతో డీఎంకే అయిదవ ప్లేస్ లో ఉంటే 16 మంది ఎంపీలతో టీడీపీ ఆరవ ప్లేస్ లో ఉంది అని అంటున్నారు. ఇలా జాతీయ స్థాయిలో ఆరవ ప్లేస్ లో ఉన్నా ఎన్డీయే అధికార కూటమిలో రెండో ప్లేస్ లో టీడీపీ ఉంది. అలా తన ప్రాముఖ్యతను చాటి చెప్పింది అని అంటున్నారు.

టీడీపీ 1984 నుంచి జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ వస్తోంది. 1984లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. 1999లో 35 మంది ఎంపీలతో వాజ్ పేయ్ ప్రభుత్వంలో కీలకంగా మారిన సంగతి తెలిసినదే. ఈసారి చూసుకుంటే... 16 మంది ఎంపీలతో ఎన్డీయేకు ఆక్సిజన్ గా మారింది టీడీపీ ప్రభుత్వం. ఇక వైసీపీ నంబర్ ఎంత అంటే 15వ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మొన్న మూడవ ప్లేస్ లో ఉన్న వైసీపీ ఇపుడు ఏకంగా 15వ ప్లేస్ లోకి జారడం అంటే ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మళ్ళీ ఢిల్లీలో టీడీపీ హవా స్టార్ట్ అయింది అని, ఏపీకి ఇక అన్నీ మంచి రోజులే అని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: