ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ రోజున అసెంబ్లీ సమావేశం కొన్ని నిమిషాల క్రితం మొదలైంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు స్నేహితులకు సైతం ఒక భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీరి ప్రమాణస్వీకారం చూడడానికి వీలు లేనటువంటి గా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేసే సమయంలో తమకు ముఖ్యమైన వారిని తీసుకురావడం జరుగుతూ ఉండేది.


ఒకవేళ ఇలా జరగకపోతే అసెంబ్లీ ప్రాంగణంలో ఉండేందుకు వీలుగా పలు రకాల పాసులను కూడా జారీ చేస్తూ ఉండేవారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నేపథ్యంలో ఇప్పుడు అలాంటివేమి కుదరలేదు. ఏపీ అసెంబ్లీలో సందర్శకులకు తగిన సిట్టింగ్ లేనందువలన ఎన్నికైన శాసనసభ్యుల కుటుంబాలకు ఇతరులకు పాసులు జారీ చేయడం కుదరదని అధికారులు తెలియజేశారట. పాసులు మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న చాలా మంది నేతలకు ఇది నిరాశ అని చెప్పవచ్చు. వారే కాదు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులకు కూడా ఇదొక షాకింగ్ విషయం.


పాసులు జారీ చేయని నేపథ్యంలోని అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో ఎవరు ఉండకూడదు అంటూ ఏపీ ప్రభుత్వం కూడా పలు రకాల నిర్ణయాలను తీసుకువచ్చింది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి చారిత్రాత్మకమైన విజయం అందుకుంది. దీంతో టిడిపి నేతలు సైతం పెద్ద ఎత్తున అసెంబ్లీకి వచ్చి తమ అభిమాన నేతల ప్రమాణస్వీకారాన్ని చూడాలనుకున్న చాలామందికి ఆశలు అడియాశలు అయ్యాయని చెప్పవచ్చు.. ప్రస్తుతం టిడిపి నేతలు కూడా ఒక్కొక్కరుగా వచ్చి ప్రమాణ స్వీకారాన్ని చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఒక శపథం చేసి బయటికి వచ్చారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సభలో అడుగు పెడతానని తెలిపారు అన్నట్టుగానే చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకొని మళ్ళీ ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: