ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు వరుసగా వారి వారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర నూతన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ గురువారం సాయంత్రం సచివాలయంలోని  రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక పరంగా ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అనేది మంచి వనరులు ఉన్న రాష్ట్రం కనుక అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి కందుల దుర్గేష్.ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తాం. పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజానీకం వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఇకపై పర్యాటక సాంస్కృతిక విధానాల్లో సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయి. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు.ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని అదే విధంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ఎన్నో అందమైన లొకేషన్లు, ప్రాంతాలు ఉన్నాయని, సినీ రంగ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన స్టూడియోల నిర్మాణానికి రాష్ట్రం ఎంతో అనువుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి, మౌలిక వసతుల మెరుగుదలకు సినీరంగ ప్రముఖులు, నిర్మాతలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను కోరారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాట రంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: