ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేతగా మాజీ మంత్రిగా పేరుపొందిన కొడాలి నాని పైన తాజాగా కేసు నమోదయ్యింది. ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు అయిన శశి భూషణ్ తో సహా మరో ముగ్గురు పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే ఎన్నికల ముందు తమతో బలవంతంగా వాలంటరీ పోస్ట్ లకు రాజీనామా చేయించారు అంటూ కొంతమంది గుడివాడ వాలంటీర్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. నానితో పాటు మరో ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


గుడివాడ పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గోర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతల పైన కూడా..447,506 సెక్షన్ కింద వీరి పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. మరి ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి..మరొకవైపు కొడాలి నాని తాడేపల్లి జగన్ నివాసంలో జరిగినటువంటి వైఎస్ఆర్సిపి సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ చర్చించిన అంశాల పైన కూడా మాట్లాడారు. ముఖ్యంగా చంద్రబాబు ఎన్నికలలో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారనే విషయాన్ని కూడా తెలియజేశారు మీడియా సమూహంగా..


అలాగే గత కొద్ది రోజులుగా విశాఖలో ఋషికొండ పైన వస్తున్న తప్పుడు వార్తల పైన కూడా మాట్లాడుతూ టిడిపి నేతలు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారంటు ఫైర్ అయ్యారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలాంటి తప్పు దావ పట్టించేందుకు చేస్తూ ఉంటారంటు ఫైరయ్యారు. ముఖ్యంగా తాము చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటు కూటమిని ప్రశ్నించారు కొడాలి నాని.. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాటిని నెరవేర్చాలని అలాగే మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటూ తెలియజేశారు. అలాగే ఋషికొండలో ఏర్పాటుచేసిన ఫర్నిచర్ పైన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇకనైనా అసత్య ప్రచారాలు చేయడం టిడిపి నేతలు మానుకోవాలంటు వెల్లడించారు. ఋషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి అంటూ అవి జగన్ వి కాదు అని తెలుసుకుంటే మంచిది అంటూ ఫైర్ అయ్యారు.. కేవలం అతిధుల కోసమే భవనాలు కడితే ఇలాంటి రాద్దాంతం ఎందుకు అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: