ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి పార్టీ అధికారంలోకి రావడం మొదలు అప్పుడే వైసిపి కార్యకర్తల పైన నేతలపైన పలు రకాల కేసులను బకాయించాలని చూస్తున్నారు. ముఖ్యంగా వైసిపి పార్టీ నిర్మించినటువంటి భవనాలను కూడా కూల్చివేయడమే కాకుండా శిలాఫధకాలను కూడా తొలగిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున తాడేపల్లిలో తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని సిఆర్డిఏ అధికారులు సైతం కూల్చివేసినట్లుగా తెలుస్తోంది.దీని పైన తాజాగా మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.


ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు నాయుడు తన దయనకాండను మరొక సాయికి తీసుకువెళ్లారు అంటూ వెల్లడించడమే కాకుండా.. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తికా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తన పలుకుబడితో ఈ రోజా కూల్చి వేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టారని రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోతోంది అంటూ తెలియజేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఈ హింసాత్మకమైన ఘటనలతో రక్తాన్ని పారిస్తున్నారు చంద్రబాబు అంటూ ఈ ఘటన తర్వాత ఈ ఐదేళ్లతో పాటు పాలన ఏవిధంగా ఉండబోతుందో హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే చంద్రబాబు ఇచ్చేసారంటూ తెలియజేశారు.


ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు తగ్గేదే లేదు అన్నట్లుగా తెలిపారు. అలాగే వెన్ను చూపేది అంతకన్నా లేదు అంటూ ప్రజల తరఫున ప్రజా లోకం ప్రజల తోడుగా గట్టిగా పోరాటం చేస్తానని దేశంలోని ప్రజాస్వామ్య వాదులందరూ కూడా చంద్రబాబు దృశ్యాలని ఖండించాలంటూ కోరుతున్నానని తెలియజేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఈ పోస్టు అటు నేతలు కార్యకర్తలు సైతం వైరల్ గా చేస్తూ ఉన్నారు. 2024 ఎన్నికలలో భాగంగా వైసిపి ప్రతిపక్ష హోదాని కూడా లేకుండా కూటమి ఓడించింది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: