తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫీరాయింపుల పర్వం జోరుగా సాగుతోంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాని కట్టబెట్టారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగానే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఇక బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇలాంటి పరిస్థితుల మధ్య గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఏకంగా 20 మందికి పైగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారని త్వరలోనే హస్తం గూటికి చేరుకుంటారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై బిఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా కారు పార్టీ నుంచి హస్తం గూటికి చేరుకోబోయే ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లను కూడా విడుదల చేయడం సంచలనంగానే మారిపోయింది అని చెప్పాలి.


 ఇలా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అంటూ చెప్పిన ఎమ్మెల్యేల లిస్టులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేరు కూడా ఉంది. అయితే ఇదే విషయంపై వివేకానంద స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఇలా కాంగ్రెస్ లోకి వచ్చే వారిలో వివేకానంద కూడా ఒకరు అంటూ దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై వివేకానంద కౌంటర్ ఇచ్చారు. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చిన దానం నాగేందర్ రాజకీయ చాప్టర్ ఖతం అయింది అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉండడమే కాదు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే అంటారు. ఇది దానం గ్రహించాలి అంటూ హితవు పలికారు. తాము ప్రతిపక్షంలో ఉన్న ప్రజల తరఫున పోరాటం చేస్తామంటూ కేపీ వివేకానంద చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs