పల్నాడు జిల్లాలోని ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటి నరసరావుపేట.అందుకే నరసరావుపేట కు రాజకీయంగా అంత ప్రాధాన్యత ఉంది.నరసరావుపేట పార్లమెంట్ చరిత్ర చూస్తే ఇప్పటిదాకా బయటివ్యక్తులు ఎక్కువసార్లు విజయం సాధించారు. స్థానికత నినాదంతో బరిలోకి దిగిన నాయకులు సైతం చాలామంది ఓటమి పాలయ్యారు.అయితే 1996నుండి నరసరావుపేట పార్లమెంట్ నుండి పోటీచేసిన అభ్యర్థులు సింగిల్ టైం మాత్రమే గెలుస్తూ వచ్చారు.సిట్టింగ్లు రెండో సారి బరిలోకి దిగిన కూడా మరల గెలిచినట్లుగా నరసరావుపేట రాజకీయ చరిత్రలో లేదు. అయితే గత 2019 ఎన్నికల్లో విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయ కూడా ఈ సెంటిమెంట్ నుండి తప్పించుకోలేరని రాజకీయ విశ్లేషకులు అన్నారు.అయితే అలాంటి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరీ రికార్డ్ లెవెల్ స్థాయిలో విజయాన్ని అందుకున్నారు యువనేత లావు.1996 లో టీడీపీ నుండి ఎంపీ గా బరిలోకి దిగిన కోట సైదయ్య గెలిచారు. 1998లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన రోశయ్య సిట్టింగ్ ఎంపీ సైదయ్య పై గెలిచారు.1999 లో కాంగ్రెస్ నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పై టీడీపీ అభ్యర్థి లాల్ జాన్ బాషా ఓటమి చవిచూశారు.అలాగే 2004 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన మేకపాటి రాజమోహనరెడ్డివిజయం సాధించారు. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని మార్చి వల్లభనేని బాలశౌరిని బరిలోకి దించింది.టీడీపీ నుండి అపుడే తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన మోదుగుల వేణుగోపాలరెడ్డి పై బాలశౌరి ఓటమి పాలయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి బరిలోకి దిగిన రాయపాటి సాంబశివరావు చేతిలో వైసీపీ అభ్యర్థి ఆళ్లఅయోధ్య రామిరెడ్డి ఓటమికి గురయ్యారు.అయితే గత 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి లావు పోటీ చేస్తే టీడీపీ మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాయపాటిని మరల రెండోసారి రేస్ లో నిలిపింది.అయితే యువనేత లావు రాజకీయ ఘనాపాటి ఐనా రాయపాటి పై లక్షన్నర ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.దాంతో నియోజకవర్గంలో అప్పటిదాకా ఆ సెంటిమెంట్ నెగ్గు తూ వచ్చింది.కాకపోతే లావు రెండోసారి టీడీపీ కండువా కప్పుకొని బరిలోకి దిగారు.అయితే వైసీపీ లావు పై స్థానికతర అభ్యర్థి ఐనా మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను బరిలోకి దింపింది. దాంతో నరసరావుపేట సెంటిమెంట్ ప్రకారం కొత్త అభ్యర్థిదే గెలుపు అంటూ నియోజకవర్గంలో ప్రచారం బాగా జరిగింది.అయితే టీడీపీ అభ్యర్థిగా ఉన్న లావు ఈసారి ఆ సెంటిమెంట్ ను బద్దలు కొడుతూ ఈసారి లక్ష యాభై వేల ఓట్ల మెజారిటీతో లావు గెలుపొందారు.అయితే నరసరావుపేట పార్లమెంట్ నుండి 1996 కు ముందు రెండు సార్లు గెలిచినా అభ్యర్థులలో కాసు బ్రహ్మానందరెడ్డి,కాసు కృష్ణారెడ్డి, మద్ది సుదర్శనం మాత్రమే ఉన్నారు.అయితే పాతికేళ్ళ తర్వాత లావు ఆ రికార్డ్ ను రిపీట్ చేశారు.ప్రజలపై తనకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ రికార్డు స్థాయి విజయం సాధించి చరిత్రను తిరగరాసారు.