ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నారు.  ఏపీలో ఘోరంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి... టైం అస్సలు బాగాలేదని తెలుస్తోంది. ఏపీలో వరుస షాకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగులుతున్న  నేపథ్యంలో... తాజాగా  వైయస్ జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి పెను ప్రమాదం తప్పింది.


కడప విమానాశ్రయం నుంచి... పులివెందులకు...  వెళ్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రెండు కాన్వాయ్‌ లో ఉన్నటు వంటి రెండు వాహనాలు ఒక దానికి ఒకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ సంఘటన... పులివెందుల పరిధిలోని రామరాజు పల్లి వద్ద జరిగింది. జగన్‌ వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని... ఫైర్ ఇంజన్ వాహనం ఢీ కొట్టింది. అయితే ఈ పెను ప్రమాదంలో ఎవరికీ కూడా గాయాలు కాలేదు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి తో ఉన్నవారు ఊపిరిపించుకున్నారు.

అటు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి గాయాలు కాలేదు. వాస్తవానికి... ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావాలి. కానీ నిన్ను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి... ఇవాళ తన సొంత నియోజకవర్గ పులివెందుల పర్యటనకు బయలుదేరారు. ఇందులో భాగంగానే ఉదయం 11 గంటల సమయంలో... తాడేపల్లి లోని తన నివాసం నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టు కు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి.

ఇక అక్కడి నుంచి.. ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. అయితే కడప నుంచి పులివెందులకు వస్తున్న నేపథ్యంలోనే...ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా తన సొంత నియోజకవర్గ పులివెందులలో దాదాపు రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారట. ఈ సందర్భంగా నియోజకవర్ అభివృద్ధిపై పార్టీ నేతలతో చర్చించనున్నారట. అలాగే వైసిపి ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించనున్నారట జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: