ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా  ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి.  కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా టిడిపి కూటమి మంచి మెజారిటీతో గెలిచింది. అలాంటి ఈ తరుణంలో  అంతేకాకుండా కేంద్రంలో కీలకంగా కూడా మారింది టిడిపి పార్టీయే అని చెప్పవచ్చు. టిడిపి కూటమికి వచ్చిన ఎంపీ 21 సీట్లతోనే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి మోడీ మరోసారి ప్రధాని అయ్యారు.. ఇదంతా జరగడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు.  అందుకే మోడీ చంద్రబాబును ముఖ్యంగా థారీప్ చేస్తున్నారు. చంద్రబాబు ఏది అడిగినా రాష్ట్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఇదే తరుణంలో తాజాగా జరిగినటువంటి కేంద్ర ఫ్రీ బడ్జెట్ మీటింగులో రాష్ట్ర ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీటింగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఇందులో రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెంట్  సహకారం అందించాలని ప్రత్యేకంగా అర్జీ పెట్టుకున్నారు.  అమరావతిని రాజధానిగా నిర్మాణం చేసే దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి 15వేల కోట్లు కేటాయించమని కోరారు. రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్రం సహకారం అందించాలని అన్నారు. అలాగే ఏపీలోనే వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి కూడా భారీ బడ్జెట్ కేటాయించాలని అన్నారు.

అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లు, పార్కులకు  ముఖ్యంగా రెండు రోడ్లు విశాఖ చెన్నై, హైదరాబాద్ బెంగుళూరు  భారీగా నిధులు కేటాయించాలని అన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ పార్కులకు భారీగా అమౌంట్ కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి అర్జీ పెట్టుకున్నారు. మొత్తానికి ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి కేంద్ర సహకారం పూర్తిగా ఉండాలని  నిర్మల సీతారామన్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. దీనికి నిర్మల సీతారామన్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ తాతంగమంతా చూసినటువంటి  దేశ ప్రజలు చంద్రబాబుకు మోడీ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: