•భరత్ పైనే విశాఖ ప్రజల ఆశలు!


•అందమైన విశాఖని అంతర్జాతీయ నగరంగా మారుస్తాడా?


•విశాఖని ఇంటర్నేషనల్ ఐటి సిటీగా మారుస్తాడా?


విశాఖ - ఇండియా హెరాల్డ్: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య జరిగిన ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీ సీటుకి పోటీ చేసిన శ్రీ భరత్ భారీ మెజారిటీతో గెలిచి ఘన విజయం సాధించి విశాఖ ఎంపీ అయ్యారు. శ్రీ భరత్ మంచి ధనవంతుడు. గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు. అలాంటి శ్రీ భరత్ ని విశాఖ ప్రజలు భారీగా ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా శ్రీ భరత్ విశాఖ సమస్యలపై పోరాటం చెయ్యాలి. తనని నమ్మి ఓట్లు వేసి తనకి అఖండ విజయాన్ని అందించిన విశాఖ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విశాఖ ప్రజలకు మేలు చెయ్యాలి. విశాఖ చాలా అందమైన నగరం. అలాంటి అందమైన నగరాన్ని ఇంకా అందంగా మార్చేందుకు శ్రీ భరత్ కృషి చెయ్యాలి. విశాఖని ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమే గర్వించదగ్గ సిటీగా మార్చాలి. విశాఖని అంతర్జాతీయ సిటీగా మలచాలి. అందుకే జనాలు ఆయనకి ఓట్లు వేశారు.


కాబట్టి విశాఖ అభివృద్ధి కొరకు, విశాఖ సమస్యల కొరకు కేంద్రంలో శ్రీ భరత్ తన గళం వినిపించాలి. ప్రజా సమస్యల పై ఖచ్చితంగా పోరాటం చెయ్యాలి. ఎన్నికలకి ముందు శ్రీ భరత్ జనాల్లోకి వెళ్లారు.తిరిగారు.వాళ్ళతో మాట్లాడారు.కష్టపడారు. అదే కష్టాన్ని ఇప్పుడు ఎంపీగా కూడా కొనసాగించాలి. యూత్ కి ఐకాన్ గా నిలవాలి. విశాఖ లాంటి అద్భుతమైన సిటీ ఉన్నా కూడా నేడు ఆంధ్రా యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విశాఖని మంచి ఐటి సిటీగా మార్చేందుకు భరత్ కృషి చెయ్యాలి. అలాగే ఎడ్యుకేషన్ హబ్ గా మలచాలి. అనేక పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చెయ్యాలి. నిరుద్యోగాన్ని అరికట్టాలి. స్టీల్ ప్లాంట్ ఇంకా వైజాగ్ కి సంబంధించిన సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. వాటితో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి.ఎంపీగా ప్రత్యేక హోదా, పోలవరం సమస్యలపై కేంద్రంతో పోరాటం చేసి ఆ సమస్యలని నెరవేర్చేందుకు తగిన కృషి చెయ్యాలి. మరి రాబోయే 5 ఏళ్లలో శ్రీ భరత్ ఎంతవరకు జనాలకు మేలు చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: