తెలంగాణ రాష్ట్రంలో... ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకు పడిపోవడం ఆ పార్టీకి తీవ్ర  నష్టం చేస్తోంది. ఆత్మవిశ్వాసంతో ఉన్న గులాబీ లీడర్లు... ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ... బయటికి వెళ్తున్న నేపథ్యంలో.. ఉద్యమ నాయకులు మాత్రం ఆ పార్టీలో ఉంటున్నారు.


అయితే ఈ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్ చేశారట. ఎలాగైనా సరే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని...కూడా కాంగ్రెస్‌ లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే.. దీనిపై స్వయంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. తనను పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని సంచలన ఆరోపణ చేశారు బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.


అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు. వేధింపుల్లో భాగంగా తన పై ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదు చేశారని ఆగ్రహించారు. నాతో పాటు నా భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. అలాంటి వాటికి భయపడకుండా న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు, అరెస్టులు నాకు కొత్త కాదని స్పష్టం చేశారు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి.


ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదు...చివరి వరకు కేసీఆర్‌ తోనే ఉంటానని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఇలాంటి వాతావరణం  చూడలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోకి రాక ముందు ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేశాను...నాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారని ఆగ్రహించారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చేస్తున్నారు...రాజకీయాల్లో విలువలు పాటించాలి, గెలిచిన పార్టీలోనే ఐదేండ్లు ఉండాలన్నారు పల్లా.

మరింత సమాచారం తెలుసుకోండి: