ఇదంతా ఇలా ఉంటే తాజాగా వైయస్ షర్మిల పైన కాంగ్రెస్ అధిష్టానానికి ఇద్దరు కాంగ్రెస్ నేతలు సైతం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో షర్మిల ఈ ఇద్దరికీ శోకాస్ నోటీసు కూడా జారీ చేసిందట. ముఖ్యంగా ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు వారం రోజులలో కచ్చితంగా వివరణ ఇవ్వాలని పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు పలు రకాల ఉత్తరులను ఆదేశించారు. ముఖ్యంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, ఏపీ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ఇద్దరు కూడా అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేశారు.
దీంతో సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి లకు ఇద్దరికి పిసిసి నోటీసులను జారీ చేసింది. మీడియా సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేశారని పార్టీ ప్రతిష్టను కూడా భంగం కలిగించేలా చేశారని నోటీసుల్లో తెలియజేసినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి షర్మిల ఒంటెద్దు పోకడలే కారణం అంటూ ఆరోపించారు ఆ ఇద్దరు నేతలు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికలలో కూడా సమర్థులైన నేతలకు కూడా టికెట్లు ఇవ్వలేదని కూడా విమర్శించడం జరిగింది. కేవలం డబ్బులు ఇచ్చినవారికి బీఫాన్ కేటాయించారని తెలియజేశారు వీటిపైన అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారు పద్మశ్రీ, రాకేష్ రెడ్డి..ఈ విషయం అధిష్టానానికి చెప్పగానే షర్మిల వీరిద్దరికీ నోటీసులను జారీ చేసింది.