ముఖ్యంగా తాము తీసుకునేటువంటి పథకం ఎవరికి ఇబ్బందిని కలిగించకుండా ఉండడమే కాకుండా మహిళలకు సైతం ఉపయోగపడేలా ఉంటుందంటూ తెలియజేశారు. చంద్రబాబు ఉన్న ఐదేళ్లు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు ఇక సచివాలయం నాలుగో బ్లాక్లో ఉన్న ఛాంబర్ లో రాంప్రసాద్ రెడ్డి రవాణా క్రీడాల శాఖ మంత్రిగా బాధ్యతలను సైతం చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ తెలియజేశారు.
అలాగే రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగు పరుస్తామంటూ కూడా తెలియజేశారు. ప్రతిభ కనబరిచే ప్రతి క్రీడాకారునికి కూడా ప్రోత్సాహం అందేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అంటు వెల్లడించారు.అలాగే ఆర్టీసీ బస్సులో ప్రమాదాల నివారణకు సైతం ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అంటూ వెల్లడించారు. అలాగే తనకు పరిధిలో ఉండే మూడు శాఖలను సైతం అందించిన చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపటి రోజున కమిటీ వేసిన తరువాత ఒక నెలలోపు అమలయ్యేలా చేస్తామంటూ తెలియజేశారు. ఇవే కాకుండా మేని పోస్టు లో ప్రకటించిన ప్రతి హామీను కూడా నేరవేరుచుకుంటూ ముందుకు వెళ్తామంటూ తెలియజేశారు. ముఖ్యంగా పింఛనీ పెంపు వ్యవహారం పైన కూడా చంద్రబాబు నాయుడు సొంతకం పెట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తారేమో చూడాలి.