వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అమలు చేశారు. చంద్రబాబు కూడా అలానే చేయాల్సి ఉంటుంది లేకపోతే ప్రజల సంక్షేమాన్ని చూసుకోగల సమర్థవంత నాయకుడు ఒక్క జగన్ మాత్రమే అని ప్రజలు రియలైజేషన్ కి వస్తారు. అయితే జగన్ పోయినసారి కోటి 40 లక్షల మంది కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందజేశారు.
ఇంతమందికి లబ్ధి చేకూర్చినా ఓటు వేసిన వారి తక్కువే. అందువల్ల చంద్రబాబు నాయుడు పథకాలను అమలు చేసిన పెద్దగా ఒరిగేది ఏమీ లేదనే ఒక అభిప్రాయంలో ఉండవచ్చు. మళ్లీ చంద్రబాబు ముందు ప్రవేశపెట్టిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్తే చాలు ఎక్కువ వస్తాయి కదా అని నమ్మేసి ఆయనకే ఓటు గుద్దుతారు. చెప్పినట్లే అన్నిటిని నెరవేరుస్తారా లేదా అనేది ప్రజలు పట్టించుకోరు అసలు పార్టీ ఏమి ఇస్తుందో అది ముందుగా పట్టించుకుంటారు. అందుకే ఇంతకుముందు చంద్రబాబు కోటి ఉద్యోగాలు అని చెప్పడం నిరుద్యోగ భృతి అని చెప్పడం ఇవన్నీ చేయకపోయినా ఆయననే మళ్లీ నమ్మారు.
చెప్పిన మాట నెరవేర్చిన ఏకైక నాయకుడిగా జగన్ భారతీయ రాజకీయ చరిత్రలో నిలిచిపోతారు. అలా ఉన్నందుకు ప్రజలు ఓడించడం విస్మయకరం. మళ్లీ ఆయనను నమ్మితే మంచి రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికీ జగన్ చేసింది 100% కరెక్ట్ అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు.