దాదాపుగా ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటారు. కానీ అందుకోసం చేసే ప్రయత్నాలు మాత్రం పెద్ద స్థాయలో ఉండవు. తాము అనుకున్న కలల కోసం కొన్ని రోజులు కష్టపడి ఇది మన వల్ల కాదు అనుకొని అక్కడే వదిలి వేస్తారు . కొంత మంది మాత్రమే తాము అనుకున్న కలను నెరవేర్చుకోవడం కోసం ఎంత గానో కృషి చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో డాక్టర్ సరిపల్లి కోటి రెడ్డి ఒకరు . కోటి రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా జనార్ధనపురం [ప్రస్తుతం నందివాడ మండలం] గ్రామంలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో  జన్మించారు.

గుడివాడలో 10 వ తరగతి వరకు చదువుకున్న తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత విద్యకు బదులు కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కోర్స్ లో చేరారు. హైదరాబాద్ వెళ్ళి జావా నేర్చుకొని దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన జావా సర్టిఫైడ్ నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైక్రో సాఫ్ట్ లో పని చేస్తున్న సమయం లోనే ప్రముఖ వాషింగ్టన్ విశ్వ విద్యాలయం నుంచి ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఇక విద్యను పూర్తి చేసిన తర్వాత ఈయన తాను ఏదో ఒక ఉద్యోగం చేసుకొని గొప్పగా బ్రతకడం అనే సిద్ధాంతంతో కాకుండా పది మందికి ఉపాధి కల్పించాలి అనే సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు.

అందులో భాగంగా కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ అనే సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కి ఉపాధిని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యువ పారిశ్రామికవేత్తగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఈయన దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్ప పారిశ్రామిక వ్యక్తి స్థాయికి వెళ్లి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: