2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమిలో భాగంగా జనసేన పార్టీ మంచి విజయాన్ని అందుకుంది .దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా కాస్త పెరిగిందని కూడా చెప్పవచ్చు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్నది. తమిళనాడులో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ ఇంఫాక్ట్ ఆరంభమైనట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుని మరి 21 సీట్లకు పోటీ చేయడమే కాకుండా రెండు పార్లమెంట్ సీట్లను కూడా గెలుచుకోవడం వంటివి జరిగింది. ఇక్కడ సినీ రాజకీయానికి మంచి ఊరటన ఇచ్చింది. ముఖ్యంగా గతంలో కూడా జయలలిత, కరుణానిధి , ఎంజీఆర్ వంటి వారు కూడా తమిళనాడులో మంచి పాపులారిటీ సంపాదించుకొని సీఎం హోదాలో నిలబడ్డారు.



అయితే ఇప్పుడు తమిళ హీరో విజయ్ ఇంఫాక్ట్ కనిపించేలా కనిపిస్తోందట.ఎందుకంటే హీరో విజయ్ టీమ్ అంతా కూడా చాలా సీరియస్ గా ఎఫెక్ట్ పెడుతోందట.అక్కడ ఒక పార్టీని పర్ఫెక్ట్ గా తయారు చేసుకొని.. ముందుకు కూడా తీసుకువెళ్తున్నారు. అయితే పొత్తులు పెట్టుకొని వెళ్లాలా లేకపోతే ఒంటరిగా వెళ్లాలా అనేది ఒక్కటే ఇక్కడ తేడాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హీరో విజయ్ పార్టీ పొత్తు పెట్టుకుని వెళ్లాలనుకుంటే.. బీజేపీతో వెళ్లాలా లేకపోతే స్టాలిన్ తో వెళ్లాలా అనే విషయం ఇప్పుడు సందీప్తంగా మారింది. కానీ  వినిపిస్తున్న సమాచారం మేరకు స్టాలిన్ తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాలి అనే విధంగా విజయ్ పార్టీ ఆలోచిస్తున్నట్లు తమిళనాడులో వార్తలు వినిపిస్తున్నాయి.


అదే జరిగితే విశాల్ నేతృత్వంలో వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడులో ఇద్దరు సినిమా యాక్టర్లు రాజకీయాలలో  ఉండబోతున్నారు.అయితే గతంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది అలాగే కొనసాగుతూ ముందుకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు హీరోల రాజకీయం అన్నటువంటిది కీలకంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: