ఆయనకు అవకాశాలు రాలేదు... కానీ అవకాశాలను సృష్టించుకుని... సక్సెస్ లో దూసుకు వెళ్తున్నాడు. ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు కోటిరెడ్డి. అంతేకాకుండా కోటి గ్రూప్స్ పేరుతో ఎన్నో కంపెనీలను క్రియేట్ చేసి... చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి. పుట్టింది కృష్ణాజిల్లా... గుడివాడ తాలూకా జనార్ధనాపురం అనే చిన్న పల్లెటూరు. కానీ పల్లెటూరి పవర్ ఏంటో కోటిరెడ్డి చూపించారు.
ప్రపంచ స్థాయికి ఎదిగారు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.... సాధారణ రైతు కుటుంబ పరిస్థితులను ఎదుర్కొని... మైక్రోసాఫ్ట్ లో బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఈ విధంగా... కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్ తో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించి తొలి భారతీయుడిగా సంచలనమే సృష్టించారు కోటిరెడ్డి. అక్కడితో ఆగకుండా.. చాలా కంపెనీలను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదిగారు.
తనలాగా ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు... అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా... తన దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు... రెట్టింపు వేగంతో పని చేసే విధంగా... వారికి తగిన ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. ఒక ఉద్యోగికి జీతం ఇచ్చి సరి పెట్టడమే కాకుండా... అతని కుటుంబం బాగోగులను కూడా... కోటిరెడ్డి గారే చూసుకుంటున్నారు. ఆ ఉద్యోగికి ఎలాంటి అవసరమైన... ఒక అన్న లాగా ముందుకు వచ్చి నిలబడుతున్నారు. తన దగ్గర పని చేసే వారికి కష్టం కాంపౌండ్ వాల్ దగ్గరికి కూడా రాకుండా చూసుకుంటున్నారు.