ఆయన చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు వేధించడంతో 10వ తరగతి తరువాత ఉన్నత విద్యకు బదులుగా కంప్యూటర్ ప్రోగ్రామర్ గా కోర్సులు చేసారు. దీనికోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ జావా వంటి కోర్సులు నేర్చుకొని దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన జావా సర్టిఫైడ్ నిపుణుడిగా గుర్తింపు సంపాదించారు. అక్కడినుండి ఆయన ప్రయాణం చూస్తే అవాక్కవల్సిందే. ఎన్నో నైపుణ్యాలు, క్వాలిఫికేషన్లు ఉంటే తప్ప సాధించలేని ఘనతలు సాధించారు. అతని టాలెంటు తెలిసి మైక్రో సాఫ్ట్ ఆయనని పిలిచింది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ప్రముఖ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించడంతో అక్కకి వెళ్లి ఉన్నత విద్యల్ని పూర్తి చేశారు.
అవును... కృషి, పట్టుదలకు కోటిరెడ్డి సరిపల్లి నిలువెత్తు నిదర్శనం. ఆ తరువాత విదేశాల్లో ఆయనికి స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ పుట్టిన దేశానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఆలోచనతో భారత్ కు తిరిగి వచ్చి వేర్వేరు రంగాల్లో ఎంట్రీ ఇచ్చి వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ క్రమంలో వైద్యం, టెక్నాలజీ, మీడియా రంగాలలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. 750 రూపాయల తొలి జీతం అందుకున్న కోటిరెడ్డి నేడు మిలియన్ డాలర్ల సంపాదించే స్థాయిలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు.
ఆయన కలలకి, శ్రమకి, త్యాగానికి ఫలితంగా స్థాపించినవే భారత్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, ఇండియా హెరాల్డ్ మీడియా, డిజిటల్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్స్, డీజే పే, పినాకిల్, భారత్ హెల్త్‌కేర్ ల్యాబ్స్, పిల్బే, నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్, బ్లడ్, శ్రీధరణి, మరియు ఇంటర్నేషనల్ క్వాలిటీ మెజర్స్ సంస్థలు. ఒకే ఒక వ్యక్తి ఇన్ని సంస్థలను రన్ చేయడం సాధ్యమయ్యే పనికాదు. కానీ కోటిరెడ్డి అనే వ్యక్తి నిత్య కృషీవలుడు. ఆయా టెక్ కంపనీలతో పాటు కోటి ఫౌండేషన్ ద్వారా ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన జీవితాశయంగా 230 దేశాల్లోని.. 769 కోట్ల ప్రజల జీవితాల్లో సానుకూల ప్రభావం తీసుకురావాలన్న కోటిరెడ్డి ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.