ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలు రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి రాష్ట్రానికి మేలు జరిగేలా చేయాలని ఏపీ వాసులు కోరుకుంటున్నారు. ప్రధానంగా 10 సమస్యల గురించి పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలని సామాన్యులు భావిస్తున్నారు. ఈ సమస్యలలో కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికినా ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు పడతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పార్లమెంట్ లో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి చర్చ జరగాలని సామాన్యులు భావిస్తున్నారు. ఈ పరీక్ష ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసే పరీక్ష అనే సంగతి తెలిసిందే. పేపర్ లీక్ వల్ల డాక్టర్లు కావాలని భావిస్తున్న ఎంతోమంది కలలు కల్లలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వైజాగ్ రైల్వే జోన్ గురించి పార్లమెంట్ లో చర్చ జరగడంతో పాటు విశాఖకు న్యాయం జరగాలని సామాన్యులు ఫీలవుతున్నారు.
 
కడప స్టీల్ ప్లాంట్ దిశగా అడుగులు పడాలని రాయలసీమ అభివృద్ధి జరగాలంటే కడప స్టీల్ ప్లాంట్ మాత్రమే మార్గమని రాయలసీమ యువత భావిస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చేలా పార్లమెంట్ లో ఏపీ ఎంపీలు కోరాలనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు చేయడంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడకూడదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల గురించి ఎంపీలు గళం విప్పాలని, పోర్టుల అభివృద్ధి గురించి సైతం చర్చించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్, విశాఖకు మెట్రో గురించి సైతం చర్చ జరగాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఎంపీలు ఈ సమస్యలలో ఎన్ని సమస్యల గురించి ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది. ఏపీ అభివృద్ధి జరిగితే మాత్రమే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారుతుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: