ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో... కొంతమంది నేతలను తెలుగుదేశం ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. ఈ లిస్టులో కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయులు ఉన్నారు. జూన్ 4వ తేదీన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుందని ఫలితాలు వచ్చిన వెంబడే.... కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీలను... తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేశారు. ఇక ఈ ఫలితాలు రాగానే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లినట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
 

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం... గుడివాడ లో ఉంటూ ఎవరికి కనిపించడం లేదు. మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో... వల్లభనేని వంశీ,  కొడాలి నాని ఇద్దరు  జూనియర్ ఎన్టీఆర్ టచ్లోకి వెళ్లారట.  తమ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు గురించి... నందమూరి తారక రామారావు  మనుమడు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చిస్తున్నారట కొడాలి నాని, వల్లభనేని వంశీ.


అంతేకాకుండా తమపై తెలుగుదేశం పార్టీ నేతలు పెడుతున్న ఇబ్బందులు, కేసులు తగ్గించాలని జూనియర్ ఎన్టీఆర్ను కోరారట. ఎలాగైనా... తమని బయటపడేయాలని... తారక్ ముందు తమ గోడు చెప్పుకున్నారట. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ  లపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్ అయ్యారట. పదవులు ఉన్నప్పుడు.. రెచ్చిపోయి మాట్లాడారు. ఇప్పుడు పదవి పోయాక... తన దగ్గరికి వస్తున్నారా అని మండిపడ్డారట.

రాజకీయాల పరంగా తానేమి... సహాయం చేయలేనని వల్లభనేని వంశీ అలాగే కొడాలి నానికి తేల్చిచెప్పారట. దీంతో... కొడాలి నాని,  వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడ్డట్టేనని అంటున్నారు. కాగా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజక వర్గంలో కొడాలి నాని ఓటమి పాలు అయ్యారు. ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోయారు. ఇక అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: