2024 ఎన్నికలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది.. కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలకు 164 సీట్లతో ఘన విజయాన్ని అందుకున్నాయి. అయితే ఓడిపోయిన తర్వాత అటు కార్యకర్తలలో నేతలలో జగన్ ధైర్యాన్ని నింపుతూ ముందుకు వెళ్లాలంటు సూచిస్తున్నారు.అంతేకాకుండా మరి కొద్ది రోజులలో యాత్ర కూడా మరొకసారి మొదలు పెడతాను అంటూ తెలియజేశారు జగన్. ఇటీవలే తన సొంత ఊరు అయిన పులివెందులలోకి చేరుకున్న జగన్ అక్కడ ప్రజలు ఘన స్వాగతాన్ని పలికారు.



నిన్నటి రోజున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి కూడా వెళ్లడం జరిగింది.దీంతో ఒకసారిగా టిడిపి నేతలు కాస్త ఆందోళన కనపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ బెంగళూరులో చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున జనాలు రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా బెంగళూరులో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కొంతమంది రావడం జరిగిందట.. ఆ వచ్చినటువంటి సందర్భంలో జరిగినది ఏందయ్యా అంటే.. కొంతమంది జగన్ కలవడానికి వచ్చినప్పుడు జగన్ వారిని కలవకుండా వెళ్లిపోయారని ఆగ్రహం తీవ్రంగా దుర్భాశాలు మాట్లాడడం జరిగింది. జగన్ డౌన్ డౌన్ సైకో డౌన్ డౌన్ అన్నట్టుగా నినాదాలు చేశారు.


అయితే అందుకు  సంబంధించి టిడిపి పార్టీలు కావాలని ఇలా చేశాయంటూ వైసీపీ నేతలు తెలియజేస్తూ ఉండగా.. ఇదంతా పక్కన పెడితే అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అయితే జగన్ ఇంటి వద్ద ఇలా చేయడంతో  ఇవి మరింత అనుమానాలకు దారితీస్తున్నాయి.. అయితే ఇదంతా కేవలం టిడిపి పార్టీ దుష్ప్రచారాలు చేయడానికి ఇలాంటి పన్నాగాలు పండుతున్నాయని చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సరైన వైసీపీ కార్యకర్తలు ఇలా చేయరనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా కూడా ఇలాంటి నినాదాలు ఏ వైసీపీ కార్యకర్త చేయాలనే విధంగా పలువురు సీనియర్ నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇదంతా కేవలం టిడిపి నేతలు చేయిస్తున్న దుష్ప్రచారం అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: