* ఎమ్మెల్సీగా అర్హుడు
* పవన్‌ కు లైఫ్‌ ఇచ్చిన నేత
* పిఠాపురంలో మంచి పలుకుబడి
* జనసేతగా గుర్తింపు
* ఇండిపెండేంట్‌ గా గెలిచే సత్తా



ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించాగా... వాటన్నిటికంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం చాలా గొప్పది. తాను కచ్చితంగా గెలవాల్సిన పిఠాపురం నియోజకవర్గాన్ని...పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు వర్మ. మొదట్లో...తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై అలిగిన వర్మ... ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని... పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేశారు.


పిఠాపురం నియోజకవర్గంలో... పవన్ కళ్యాణ్ విజయం వెనుక...మాజీ ఎమ్మెల్యే వర్మ పాత్ర కచ్చితంగా ఉంది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ క్యాడర్ను...ఒప్పించి.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం పని చేయించారు. వారితో పాటు ఆయన కూడా...పిఠాపురం నియోజకవర్గ మొత్తం తిరిగారు. వైసీపీ పార్టీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా సరే... ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా... పవన్ కళ్యాణ్ విజయం కోసం మాత్రమే కష్టపడ్డారు వర్మ.


దాని ఫలితంగానే పిఠాపురం నియోజకవర్గంలో 70 వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం జరిగింది. అంతేకాకుండా ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పదవి చేపట్టారు. 2014 సమయంలో... స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురంలో జెండా ఎగరవేసిన వర్మ... పవన్ కళ్యాణ్ ను కాదని ముందుకు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ లైన్ దాటలేదు. అయితే అలాంటి.. పిఠాపురం వర్మకు... కూటమి ప్రభుత్వంలో కీలక పదవి రావాలని... తెలుగు తమ్ముళ్లే కాకుండా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు.


అటు పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని... చంద్రబాబుతో చర్చించారట. వర్మ కు  నామినేటెడ్ పదవులు కాకుండా... ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సమాచారం అందుతుంది. పార్టీ కోసం కష్టపడే వర్మ కు... ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇచ్చిన తక్కువే అవుతుందని కొంతమంది అంటున్నారు. మరి పిఠాపురం వర్మ కు... చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: