•పదవి కాదు ముఖ్యం.. ప్రజల బాగోగులే లక్ష్యం..

•అభివృద్ధి కోసం కల కూడా దూరం..

•పరిటాల శ్రీరామ్ త్యాగానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

పరిటాల శ్రీరామ్.. యువ నేతగా రాజకీయాలలోకి అడుగపెట్టిన ఈయన.. ప్రజలే ముఖ్యంగా... అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాలలోకి అడుగు పెట్టారు.. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వీరు ధర్మవరం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు.. ప్రజలలో అంతకుమించి మంచి పేరు కూడా దక్కించుకున్నారు. అందుకే పరిటాల శ్రీరామ్ ఎలాగైనా సరే ఈసారి టికెట్ దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కూటమిలో భాగంగా  టికెట్టు లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పరిటాల శ్రీరామ్.. కానీ కూటమిలో భాగంగా ఒకరికే టికెట్టు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.. ఇక అందులో భాగంగానే  రాప్తాడు తరపున ఆయన తల్లి శ్రీ పరిటాల సునీతమ్మ ఆ పదవికి పోటీ చేశారు.. ఇక దాంతో ఆయన ధర్మవరం నుంచి టికెట్టు ఆశించారు.. కానీ ఓకే కుటుంబం నుంచి ఇద్దరికీ టికెట్టు ఇవ్వలేక బిజెపికి  ధర్మవరం టికెట్ ను కేటాయించడం జరిగింది.

యువతను అభివృద్ధి పథం వైపు నడిపించి.. ప్రజలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు అన్ని విషయాల్లోనూ వారికి అండగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.. అందులో భాగంగానే ప్రచారాలు నిర్వహిస్తూ ఊరూరా తిరుగుతూ.. గడపగడపకు వెళ్లి సమస్యలను తెలుసుకొని.. ఆ సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేశారు పరిటాల శ్రీరామ్. అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై కూడా గళం విప్పి ఆయన చేస్తున్న తప్పు ఒప్పులను కూడా లెక్క కట్టారు. కానీ పెద్దలు మాత్రం బిజెపి తరఫున సత్యకుమార్ కి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పెద్దల నిర్ణయాన్ని ఆయన కాదనకుండా తన కలను పక్కనపెట్టి పార్టీ కోసం పోరాటం చేశారు.. ఎలాగైనా సరే కూటమిలో భాగంగా బిజెపిని గెలిపించాలని ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకు సహకరించారు .


అనూహ్యంగా కూటమి దాదాపు 164 సీట్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది . ఇలాంటి ఎంతోమంది యువ రాజకీయ నాయకుల పోరాటం వల్లే కూటమి ఈ స్థాయిలో విజయం సాధించిందని చెప్పవచ్చు.. అయితే కొంతమంది నేతలు తమకు టికెట్టు ఇవ్వలేదని బాధపడుతుంటే.. ఇలాంటి యంగ్స్టార్స్ మాత్రం ఇప్పుడు కాకపోతే మరొకసారి అనీ ... ముందుగా పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందడుగులు వేశారు..  ఇక వారి త్యాగానికి కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి పరిటాల శ్రీరామ్ త్యాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి ఆయనకు తగిన పదవి ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: