నవీన్ పట్నాయక్, మోడీ కనెక్షన్ గురించి జనాలకి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తొలుత బీజేపీకి మంచి మిత్రుడైన తరువాత ప్రత్యర్ధిగా మారారు. అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత స్నేహితుడుగా మారి అవసరాల్లో మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పెద్దల సభలో బిల్లులను సైతం గెలిపించిన వ్యక్తి నవీన్. అలా ఒడిశా మాజీ సీఎం బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మోడీకి ప్రియ మిత్రుడిగా మారారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వాలు, శత్రుత్వాలు వంటివి ఉండవు అన్నమాట సత్యమే. ఈ విషయం వీరి విషయంలో రుజువయ్యింది. బీజేపీ పెద్దలు తనకు మిత్రుడు అంటూనే నవీన్ అనారోగ్యంతో ఉన్నారని ఆయన మీద ప్రచారం చేయగా పెద్ద దుమారమే చెలరేగింది.

కట్ చేస్తే ఇప్పటికి వరసగా 5 సార్లు గెలుస్తూ వస్తున్న బిజూ జనతాదళ్ ఒడిషాలో దారుణ ఓటమి పాలు అయింది. దాంతో నవీన్ పట్నాయక్ మాజీ అవ్వగా బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి గెలిచింది. ఏది జరిగినప్పటికీ ఓటమిని హుందాగా తీసుకుని అసెంబ్లీకి హాజరయ్యారు నవీన్ పట్నాయక్. అది మాత్రమే కాదు... బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. ఎక్కడివరకు బాగానే ఉంది అనుకొనే లోపు ఒడిశా మాజీ సీఎం నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చారు. ఆయన మోడీతో నవ్వుతూ మాట్లాడినా తన వ్యూహాలతో తాను మోడీని ఉక్కిరిబిక్కిరి అయేటట్టు చేశారు. విషయం ఏమిటంటే.. బీజేపీతో ఎప్పటికీ పొత్తులు లేవని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు.

తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో ఆయన బీజేడీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ లో చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రతిపక్షాన్ని కోరారు. అక్కడితో ఆగకుండా ఒడిశా సమస్యల మీద పార్లమెంట్ లో ప్రస్తావించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఒడిశా ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోకపోతే బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వెనకాడమని నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఇకపోతే బీజేపీకి లోక్ సభలో మద్దతు తక్కువగా ఉంది. దాంతో మిత్రుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో ఒక మిత్రుడిగా ఉన్న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ కూడా ప్రతిపక్షమే అని స్పష్టం చేయడంతో బీజేపీ ఇరకాటంలో పడినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: