జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పాలనలో దూకుడు చూపిస్తున్నారు. అచ్చం సినిమా స్టైల్ లో హీరో చేసినట్లుగానే... ప్రజలకు అందుబాటులో ఉంటూ... వారి సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. సమస్య ఉందని ఎవరు డోర్ కొట్టిన... వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్.


గత ప్రభుత్వంలో చూపిన అలసత్వాన్ని తమ ప్రభుత్వంలో చూపించేది లేదని....కరాకండిగా పవన్ కళ్యాణ్ చెప్పేస్తున్నారు. ఏది జరిగిన ఏపీ ప్రజల అభివృద్ధి కోసమే ఉండాలని... ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తన పాలనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పంచాయతీ శాఖ, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ, పర్యాటకశాఖ  అలాగే సినిమాటోగ్రఫీ...... పౌరసరఫరాల శాఖ... ఇలా ఎన్నో.. జనసేన ఆధ్వర్యంలో ఉన్నాయి. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఈ శాఖలను  చూసుకుంటున్నారు.


అయితే... ఈ శాఖలపై ఏపీ ప్రజల నుంచి సూచనలు తీసుకునేందుకు జనసేన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని... వారి సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది జనసేన. సూచనలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నవారు... జనసేన ను సంప్రదించేలా ఒక వెబ్సైట్ లింకును క్రియేట్ చేశారు.

దానికి ఒక క్యూఆర్ కోడ్ కూడా  అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో స్కాన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేస్తే...  మనం జనసేన మంత్రులకు ఎలాంటి సలహాలు అయినా ఇవ్వాలంటే... చాలా సింపుల్ గా ఇవ్వవచ్చు. అందులో ప్రాంతం, జిల్లా తదితర వివరాలు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ కూడా  పెట్టాలి. ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వారి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే... పవన్ కళ్యాణ్ కు సలహాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సలహాలు ఇవ్వడమే కాకుండా మన సమస్యలు కూడా అక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆలోచన పట్ల ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: