ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఎక్కడ చూసినా ప్యాలెస్ లాంటి ఆఫీసులు కట్టించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ చెబుతోంది. ముఖ్యంగా రిషికొండ ప్యాలస్‌ను టీడీపీ నేతలు చాలా హైలెట్ చేస్తున్నారు. చంద్రబాబు జగన్ డబ్బులను నాశనం చేశారని ప్రజలకు తెలిసేలా చేయడానికి గత ప్రభుత్వంలో నిర్మించిన కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు. అలాగే ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. వైసీపీ వీటికి కౌంటర్ గా టీడీపీ కట్టిన అతిపెద్ద ఆఫీసులను వెలుగులోకి తెస్తోంది అయితే ఇలా భవనాల గురించే సమాచారం ప్రజలకు తెలియజేయడం వల్ల ఎవరికి ఒరిగేది ఏమీ ఉండదు.

ప్రజలు ఈ భవనాల గురించి అస్సలు పట్టించుకోరు. సాధారణంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కార్యాలయాలు కట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు తమ సొంత డబ్బులతో ఆఫీసులను కట్టుకున్నాయి. టీడీపీ, వైసీపీ మాత్రమే ప్రభుత్వానికి సొమ్మును వినియోగించాయి. ఢిల్లీలో కూడా బీజేపీ సొంత డబ్బులతో ఆఫీస్ కట్టుకుంది. అయితే పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కూడా అని ఆఫీసులో నిర్మించడానికి ప్రభుత్వ స్థలాలనే ఆక్రమించుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఇలాగే నడుస్తున్నాయి కాబట్టి ఒక పార్టీని విమర్శించడం అనేది మూర్ఖత్వమే అవుతుంది.

దీనివల్ల ప్రజలకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా ఉపయోగకరమైన పని చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే జగన్ ప్రజాభవన్ కూల్చివేశారు. చంద్రబాబు కూడా ప్రతీకారంగా ఆయన కట్టించబోయే కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భవనాలు కార్యాలయాలు చాలా అందంగా ఉంటున్నాయి. వాటిని చూడడానికే ప్రజలు ఇష్టపడుతుంటారు కానీ ధ్వంసం చేస్తుంటే చూడాలని అనుకోరు. ఈ విషయాన్ని ప్రభుత్వ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తన తెలివైన బుర్రతో ఆలోచించి ఇలాంటి పనులను మానుకోవడం మంచిదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: