తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ కొలువు దిరింది.. సీఎం గా రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. అంతే కాకుండా ఆయన కింద పలువురు మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఇప్పటికే సర్కారు ఏర్పడి  అద్భుతమైన పాలన అందిస్తోంది. ఇదే తరుణం లో ఇంకా నామినేటెడ్ పోస్టులు, కొన్ని మంత్రి పదవులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.  అంతే కాకుండా రాష్ట్రం లో  కీలక శాఖ అయినా విద్యా శాఖ కూడా భర్తీ చేయాల్సి ఉంది.. మరి ఈ శాఖ ఎవరికి ఇస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి తెలంగాణ ఉద్యమం లో ఎంతో చురుకుగా పాల్గొని  రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటు వంటి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కూడా కేబినెట్ లో, పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

అధిష్టానం కు ఈయన పేరు కూడా పంపించారట. అయితే ఈ పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ జూలై మొదటి వారం లో జరిగే అవకాశం కనిపిస్తోంది. కేవలం కోదండరాం కాకుండా మిగతా వారిని కూడా మంత్రివర్గం లోకి తీసుకుంటున్నారట. జిల్లాలు, కుల, సామాజిక అంశాల వారిగానే ఈ మంత్రి పదవులు కేటాయిస్తారట. మొత్తం క్యాబినెట్ లో 18 మంది కి అవకాశం ఉంది. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. మొత్తం ఉమ్మడి పది జిల్లాల్లో కనీసం జిల్లాకొక్క పదవి అయినా ఉండాలని  నిర్ణయం తీసుకుందట.

 ఈ విధం గా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమం లో కీలకం గా ఉన్న కోదండరాము కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి విద్యా శాఖ మంత్రి గా అవకాశం ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో  ఎవరెవరికి మంత్రి గా చాన్స్ దక్కుతుందో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: