2024 ఎన్నికలు చాలా ఉత్కంఠంగా కొనసాగాయి. అయితే ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు ఈ నెల 4వ తేదీన ఫలితాలు కూడా విడుదలై కూటమిలో భాగంగా 164 సీట్లు టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. దీంతో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.. అయితే అప్పటినుంచి ఎక్కువగా వైసీపీ నేతల మీద కార్యకర్తల మీద కార్యక్రమాల మీద నాన్న హంగామా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కొన్నిచోట్ల టిడిపి నేతలు కార్యకర్తల పై కూడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిన్నటి రోజున సాయంత్రం టిడిపి నేత ఏవీ భాస్కర్ రెడ్డి శ్రీదేవి దంపతులపైన హత్యాయత ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.



అయితే ఈ దాడిలో అటు భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందగా భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం ఈ ఘటనలో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా మరొకసారి రాజకీయ విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలోకి హుటాహుటిగా బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి టిడిపి నేత ఏవి భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి భౌతికాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సంఘటన గురించి పోలీసులను అడిగి మరి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.


అయితే ఈ ఘటన చేసిన వారిని వదిలిపెట్టకూడదని కచ్చితంగా వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలంటూ పోలీసులకు కూడా తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇలాంటి భౌతిక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ఇప్పటికే ఒకవైపు సంక్షేమల దృష్టి మరొకవైపు నిరుద్యోగులు, మరొకవైపు అభివృద్ధి వంటి వైపు దృష్టి పెడుతున్న చంద్రబాబుకు మళ్ళీ ఇలాంటి ఫ్యాక్షన్ గొడవలతో ఇబ్బందులు తలెత్తే ఎలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: