ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది కీలకంగా ఉంటుంది. ఎందుకు అంటే ప్రభుత్వం చేసే లోటుపాట్లను, తప్పులను ఎత్తి చూపించే విషయంలో ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడు ముందు ఉంటుంది. అంత ప్రాధాన్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది కాబట్టే అలాంటి హోదా దక్కడం కోసం కూడా రాజ్యాంగంలో కొన్ని కీలక అంశాలను పొందుపరిచారు. వాటి ప్రకారం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 10 శాతం సీట్లు వస్తేనే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది.

ఆ విధంగా చూసుకున్నట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 18 అసెంబ్లీ స్థానాలు దక్కుతేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కుతుంది. కానీ ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన నెలకొంది. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేస్తే వైసిపి ఒంటరిగా పోటీలోకి దిగింది. ఇక టిడిపి కి భారీ మొత్తంలో సీట్లు వచ్చాయి. జనసేనకి 21 , వైసీపీకి 11 , బిజెపికి 8 స్థానాలు దక్కాయి. ఈ విధంగా చూసుకున్నట్లు అయితే జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీలో అంతర్భాగంగా ఉంది. కాబట్టి వైసిపి కి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి.

కాకపోతే దానికి 18 అసెంబ్లీ స్థానాలు లేవు. దీనితోనే ఒక చిక్కు సమస్య ఎదురు అయ్యింది. మరి వైసిపి పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో జనసేన ఉద్దేశం ఏమిటి ..? బిజెపి ఉద్దేశం ఏమిటి ..? అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు అయినటువంటి పురందరేశ్వరి ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాలు కీలకంగా మారాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి కి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap