అయితే అప్పుడు జనం మెచ్చిన జగన్ ఇప్పుడు ఒంటరి అయ్యారు. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి విజయం సాధించగా వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అతి విశ్వాసమే వైసీపీని ముంచేసిందని చెప్పవచ్చు. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నియంత తరహా నిర్ణయాలు అని కామెంట్లు వ్యక్తమయ్యాయి. సినిమా హీరోలను ఇబ్బంది పెట్టేలా వైసీపీ తీసుకున్న నిర్ణయాలు సైతం పార్టీకి మైనస్ అయ్యాయి.
పప్పూ బెల్లాల్లా డబ్బులను పంచడం మినహా గత ఐదేళ్లలో వైసీపీ ఏం చేసిందని విమర్శలు వ్యక్తం కాగా ఆ విమర్శలకు సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. కొన్ని రంగాలకు సంబంధించి వైసీపీ ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసినా ఆ అభివృద్ధిని ప్రచారం చేసుకోలేకపోవడం పార్టీకి మైనస్ అయిందని చెప్పవచ్చు.
కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని స్థితిలో వైసీపీ ఉందంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఎందుకు ఓడిపోయిందో జగన్ కు ఇప్పటికీ అర్థం కావడం లేదని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని జగన్ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే దిశగా జగన్ అడుగులు పడాల్సి ఉంది. 40 శాతం ఓటు బ్యాంక్ వైసీపీ ఉండగా భారీగా ఓటు బ్యాంక్ తగ్గడానికి గల కారణాలను అన్వేషించి తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగితే మాత్రమే జగన్ కు మేలు జరుగుతుంది. రాబోయే రోజుల్లో అయినా జగన్ లో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.