- మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్.
- సొంత  కుటుంబీకులకే హ్యాండిచ్చాడు.
- అహంకార ధోరణి ఆదా పాతాళానికి తొక్కింది.!


ఇల్లు అలకగానే పండగ కాదు. సీఎం కుర్చీలో కూర్చోగానే  ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు. దేనికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం నడుచుకుంటేనే ప్రజల, నాయకుల మన్ననలను పొందగలుగుతాం. లేదని చెప్పి అహంకార ధోరణి చూపిస్తే మాత్రం ఎంతటి వారినైనా  కాలం అదాపాతాళానికి తొక్కేస్తుంది. దీనికి ప్రధాన ఉదాహరణ  తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో మొత్తం 151 సీట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. కానీ పాలన విషయంలో చాలా విఫలమయ్యారని చెప్పవచ్చు.  ప్రజలకు ఎన్నో అద్భుత పథకాలు తీసుకువచ్చి అందించాడు. అయినా ప్రజలు మాత్రం ఆయనను ఏమాత్రం ఆదరించలేదు.


 దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మరియు వారి కిందిస్థాయి నాయకులతో అంతగా కనెక్ట్ కాకపోవడమే. నేను ముఖ్యమంత్రిని  నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనే అహంకార ధోరణితో ఆయన పాలన చేశారు. పైకి నవ్వులు లోపల కత్తులు అనే ఆలోచనతో ఆయన పాలన చేశారు కాబట్టి ఈనాడు ఇంతగా అపజయం పాలయ్యాడు. అంతేకాకుండా జగన్ ను కలవాలి అంటే చాలా వరకు ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, కొంతమంది రాష్ట్ర మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదట. దీంతో మంత్రులు ఏదైనా ప్రజా సమస్యలు ఆయన వద్దకు తీసుకెళ్దాం అని అనుకుంటే అపాయింట్మెంట్ దొరకక వారికి వారే లోలో లోపల ఇబ్బందులు పడేవారట. ఇక మంత్రులకే జగన్ ను కలిసే అవకాశం లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.  

అంతేకాకుండా జగన్ కిందిస్థాయిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఊర్లపై పడి అనేక అక్రమాలు చేయడం, ఇసుక దందాలు చేయడం,  ప్రజలను ఇష్టం వచ్చినట్టు వేధించడం చేయడం వల్ల ప్రజల్లో మరింత మైనస్ అయింది. దీనిపై యాక్షన్ కూడా తీసుకోలేదు. మళ్లీ నేనే గెలుస్తాను, జనం నాతోనే ఉంటారని అహంకార ధోరణితో  ఉండడంవల్ల ఆయనను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఇక మరోవైపు సొంత కుటుంబీకుల నుంచి ఆయనకు వ్యతిరేక పవనాలు విచాయి. తల్లి చెల్లెళ్లు కూడా ఆయనను వ్యతిరేకించారు. కనీసం సపోర్ట్ గా నిలవలేదు.  ఇన్ని మైనస్లు జగన్ లో కనిపించడం వల్లే గోరాతి ఘోరంగా పరాభవం పొందారని చెప్పవచ్చు.  మరి ఈ పరాభవం నుంచి అయినా ఆయన గుణపాఠం నేర్చుకొని మళ్లీ వచ్చే ఎన్నికల వరకు సెట్ అయితేనే  భవిష్యత్తు ఉంటుందని లేదంటే ఇక జీవితంలో ఆయన పార్టీ ఉండే పరిస్థితి లేదని  కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: