- గెలిచిన ఎమ్మెల్యేలు ప‌క్క చూపులు
- ఐదేళ్ల‌కు జ‌గ‌న్‌కు మిగిలే వాళ్లు 5 గురైనా ఉంటారా..!
- ప్ర‌తిప‌క్షంలో ఉండేందుకు ఇష్టప‌డ‌ట్లేదా..!

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మామూలుగానే ఎవరిని నమ్మరు.. ఇంకా చెప్పాలంటే జగన్కు తన నీడను తానే నమ్మరు అన్న పేరు ఉంది. ఈ మాట వైసీపీ వాళ్ల నుంచే ఎక్కువుగా వస్తుంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన దర్శన భాగ్యం లేదు. దాదాపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు జగన్ ను ఐదేళ్లలో నాలుగైదు సార్లకు మించి కలవలేదు అంటే జగన్ సొంత పార్టీ నేతలకు ఎలా ? ప్రయార్టీ ఇచ్చారో చూస్తేనే తెలుస్తుంది. జ‌గ‌న్ సొంత పార్టీ కీల‌క నేత‌ల్లోనే చాలామందిని అస్సలు ఏమాత్రం నమ్మరు.  జగన్ చుట్టూ ఎప్పుడూ సజ్జల రామకృష్ణారెడ్డి - ధనుంజయ రెడ్డి కొన్నిసార్లు విజయసాయిరెడ్డి లాంటి నేతలు మాత్రమే ఉండేవారు. చివరి మూడు సంవత్సరాలు అయితే ప్రభుత్వం పూర్తిగా సజ్జల - ధనుంజయ రెడ్డి లాంటి వారి మీద కొనసాగిందనటంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ తమను నమ్మనప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉన్న వేళ జగన్ పార్టీ నేతలు మాత్రం ఎందుకు ? నమ్మాలి ఎస్ ఇప్పుడు ఇదే జరుగుతుంది.. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం.


వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 11 మంది ఎమ్మెల్యేల‌తో పాటు 4 గురు ఎంపీలు మాత్ర‌మే గెలిచారు. అయితే ఇప్పుడు వీరిలో కొంత‌మంది మీద సందేహాలు త‌లెత్తుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్ర‌మాణ స్వీకారానికి ముందు నుంచే అనుమానాలు మొద‌ల‌య్యాయి. వీరంతా ఐదేళ్ల పాటు అసెంబ్లీలో కూర్చొని ఇంత బ‌లంగా ఉన్న అధికార ప‌క్షం మీద పోరాటం చేయాలేం అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. పైగా అటు వైపు టీడీపీ, జ‌న‌సేన‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్లు కూడా ఉన్నారు. వీరంద‌రిని త‌ట్టుకుని అసెంబ్లీ లోప‌ల‌.. బ‌ట‌యా ఈ 11 మంది ఫైట్ చేయ‌లేరు. వీళ్ల వాయిస్ లెగిస్తే త‌మ‌కు ఎక్క‌డ ఇబ్బందో అన్న డౌట్లు కూడా వీరికి ఉన్నాయి.


ఇక అర‌కు, పాడేరు, ఆలూరు, మంత్రాల‌యం ఎమ్మెల్యేలు అయితే అధికార ప‌క్షంలోకి పోతే ఐదేళ్లు క‌నీసం త‌మ మాట‌కు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు అధికారుల ద‌గ్గర విలువ ఉంటుంద‌ని... అధికారం అనుభ‌వించ వ‌చ్చ‌ని.. ఐదేళ్ల త‌ర్వాత రాజెవ‌రో.. రెడ్డ‌వ‌రో అన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అటు పార్టీ అధినేత జ‌గ‌న్‌కు సైతం గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు... 4 గురు ఎంపీల‌లో వ‌చ్చే ఐదేళ్లు వీరంద‌రు త‌న‌తో పాటు ఉంటార‌న్న న‌మ్మ‌కాలు లేవ‌నే అంటున్నారు. ఇప్పుడు గెలిచిన నేత‌ల్లోనే కొంద‌రిపై జ‌గ‌న్‌కు డౌట్లు ఉన్నా చేసేదేం లేద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: