వైసీపీ కష్టాలు: జగన్ కు వేధిస్తున్న కూల్చివేతలు..?

 
* వైసీపీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ
* తాడేపల్లి కార్యాలయం కూల్చివేత
* ప్రభుత్వ భూముల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణమంటూ ఆరోపణలు
* ఏపీలో అన్ని వైసిపి కార్యాలయాలకు నోటీసులు



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి కష్టాలు అంతా ఇంతా కాదు. పార్టీ అధికారం కోల్పోగానే... ప్రమాదంలో పడిపోయింది ఈ వైసిపి. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం కూటమికి అఖండ మెజారిటీ రావడంతో... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి  ప్రవర్తిస్తున్నారు. అడుగడుగునా వైసిపి నేతలను అడ్డుకుంటున్నారు. రాళ్ల దాడులకు దిగుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైసిపి పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా  పనిచేస్తున్నారు.

 మొట్టమొదటగా... తాడేపల్లి లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని... ఎవరు నిద్ర లేవక ముందే ధ్వంసం చేశారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వ భూముల్లో.. పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని నేపథ్యంలో... వరుసగా వైసిపి కార్యాలయాలను కూల్చేస్తోంది  చంద్రబాబు సర్కార్.  మొదటగా తాడేపల్లి లో ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాన్ని కూల్చేసిన ఏపీ అధికారులు...  ఆ తర్వాత విశాఖను టార్గెట్ చేశారు.

విశాఖలో కూడా... వైసిపి కార్యాలయం నిర్మాణంలో ఉంది. అయితే ఆ కార్యాలయం అనుమతులు.. సరిగా తీసుకోలేదని.... విశాఖ మున్సిపాలిటీ నుంచి అనుమతి రాలేదని పేర్కొంటూ నోటీసులు ఇష్యూ అయ్యాయి.  వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని వైసిపి విశాఖ కార్యాలయానికి నోటీసులు కూడా అంటించారు. దీంతో అమర్నాథ్ ఆ నోటీసులను చింపి... నాన రచ్చ చేశారు. అయితే అక్కడితో ఆగలేదు చంద్రబాబు ప్రభుత్వం.

అనంతపురం, నెల్లూరు,  రాయలసీమలోని  కొన్ని వైసిపి పార్టీ కార్యాలయాలకు... నోటీసులు ఇష్యూ చేశారు అధికారులు. పర్యాటక శాఖకు సంబంధించిన భూములు, ఇతర ప్రభుత్వ భూములలో...  వైసిపి పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నారని... ఈ నోటీసులు అందించారు. దీనిపై వివరణ ఇవ్వకపోతే.. కూల్చేస్తామని కూడా అధికారులు స్పష్టం చేశారు. విశాఖ రుషికొండ పైన  నిర్మించిన భవనాల తరహాలోనే ప్రతి జిల్లాలో వైసిపి కార్యాలయాలను... ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నారని ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే దీనిపై కౌంటర్ చేయలేక... వైసిపి కష్టాల పాలవుతోంది. అటు తెలంగాణలో కూడా.. జగన్ ఇంటి ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం... కూల్చివేతలకు పాల్పడింది. జగన్ సెక్యూరిటీ ఉండే రూములను కూల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: