తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి... ఎప్పుడు లేని విధంగా మారిపోయింది. ఏ లీడర్ ఎప్పుడు పార్టీని విడుతాడో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్లు, బిజెపి నుంచి ఈ డి అటాకులు... ఉన్న నేపథ్యంలో గులాబీ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో... 39 స్థానాలకు పరిమితమైన గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దారుణంగా ఓడింది.

 

ఇక అప్పటి నుంచి... వరుసగా ఎమ్మెల్యేలు జారిపోతున్నారు. ఇప్పటివరకు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి,  భద్రాచలం ఎమ్మెల్యే, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, దానం నాగేందర్  పార్టీని వీడారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. అయితే... ఒక్కొక్కరు  బయటకు వెళ్తున్న నేపథ్యంలో గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలర్ట్ అయ్యారు.


వెంటనే...  ఎమ్మెల్యేలు అందరినీ తన ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు కేసీఆర్. అయితే ఇక్కడే కెసిఆర్ కు పెద్ద షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు... కెసిఆర్  మీటింగ్ కు రాలేదు. ఐదుగురు డుమ్మా కొట్టారు.  ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. అటు అంబర్పేట ఎమ్మెల్యే  వెంకటేశు, మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి... కెసిఆర్ నిర్వహించిన సమావేశానికి రాలేదు.

 

మిగతా ఎమ్మెల్యేలు అందరూ.. కెసిఆర్ సమావేశానికి వచ్చారు. దీంతో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు... అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వీళ్ళు రాలేదని అంటున్నారు. మరి దీనిపై ఈ ఐదు గురు ఎమ్మెల్యేలు... ఎలా స్పందిస్తారో చూడాలి. అటు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునేందుకు కేసిఆర్ కూడా రంగం సిద్ధం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs