•జగన్ అతి విశ్వాసానికి అడ్డుకట్ట వేసిన ఆంధ్రుల తీర్పు!


•ప్చ్.. పాపం జగన్! వచ్చిన అవకాశం పాయె! 


•ఆంధ్రులు జగనన్నకి ఇంకో అవకాశం ఇస్తారంటారా? 


అమరావతి - ఇండియా హెరాల్డ్:  2019 ఎన్నికల్లో  వైసీపీ అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం అన్న పదానికి ఆమడ దూరం కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో అలిసిపోయిన ఆంధ్రులకు ఆశించే స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చారు. కానీ ఆంధ్రులు ఆశించిన పథకాలు ప్రవేశపెట్టకుండా అసలు పనికిరాని పథకాలు పెట్టి అతి విశ్వాసం చూపించి ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయింది వైసీపీ.జగన్ కు 2019 కు ముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. కానీ అనుభవాన్ని ఉపయోగించుకోలేదు. జనాలకు రుచించని పథకాలు, నాణ్యమైన కరెంటు కోసం పెంచిన బిల్లులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నిరుద్యోగులకు 5 వేల రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు, ఉచిత ఇల్లులు కట్టుకోడానికి కాలనీ అనే పేరుతో డబ్బులు ఇస్తామని చెప్పి కనీసం బాత్రూంకి సరిపడా డబ్బులు కూడా చెల్లించపోవడం.. ఇవన్నీ జనాలు చూసి.. భరించలేక.. జగన్ ని ఇప్పుడు పాతాలానికి తొక్కేసారు. 


2024 ఎన్నికలకు ముందు జగన్ మేనిఫెస్టోను ప్రకటించిన రోజునే వైసీపీ ఓటమి ఖాయమని ఫిక్స్ అయ్యారు. అందరు అనుకున్నట్టు గానే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.రుణమాఫీ లాంటి సాధ్యం కాని హామీలు ఇవ్వలేనని చెప్పిన జగన్ కనీసం కూటమికి పోటీ ఇచ్చే రేంజ్ లో హామీలను ఇవ్వడంలో కూడా విఫలమయ్యారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీ నేతలను ఉత్సాహపరిచేలా జగన్ ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేదు. అతని రాక్షస పరిపాలన వల్లే జగన్ కు ఇప్పుడు అష్టకష్టాలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కనీసం తమ కంచుకోట రాయలసీమలో కూడా గెలవలేకపోయారు. అంతలా జగన్ తన సీమ ఆంధ్రుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయారు. ఇక జగన్ కి 2019 లాంటి అవకాశం వస్తుందా సుమా అంటే కష్టమే అధ్యక్షా అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: