* రుణమాఫీ ప్రకటించకపోవడం అతిపెద్ద తప్పు..

•సంక్షేమ పథకాలు నమ్ముకోవడమే విఫలానికి కారణం..

•జగన్ తప్పులను సరి చేసుకుంటారా..

(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటూ కొత్త పార్టీతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు ఆయన తనయుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమౌతూ వారి కష్టాలను తెలుసుకొని వారిలో బలమైన నమ్మకాన్ని పొందగలిగారు.. అలా 2019లో ఊహించని విధంగా ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించారు.. అప్పట్లో అదొక చరిత్ర రికార్డు.. సీనియర్ రాజకీయ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా ఒక యువ నాయకుడు ఆ రేంజ్ లో ప్రజల నమ్మకాన్ని పొందగలిగారు అంటే నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.

మహిళలు,  రైతులు, సామాజిక వర్గాలు ఇలా ప్రతి ఒక్కరు కూడా జగన్ ను గుండెల్లో పెట్టుకున్నారు. ఇక ఐదేళ్ల పరిపాలనలో మంచి జరుగుతుందని ఆశించారు.. కానీ జగన్ కేవలం సంక్షేమ పథకాలు అంటూ ఆ పథకాలకే పరిపాలనను  పరిమితం చేశారు.  చాలామందిని ఆయన పట్టించుకోలేదు.. నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ వదులుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మాత్రమే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు.. కానీ ఏం లాభం.. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం వెతుకులాటలో నిరుద్యోగులుగా మారుతున్నారు. అలాగే మెగా డీఎస్సీ వదులుతానని చెప్పి కేవలం కొన్ని పోస్టులకే పరిమితం చేశారు..


అలాగే రైతులకు రుణమాఫీ ప్రకటిస్తానని చెప్పి.. ప్రకటించకపోవడమే ఈసారి ఆయనకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల పేరిట డబ్బులను పెంచాడే కానీ చాలామందికి అవసరాలు ఏ విధంగా కూడా తీర్చలేకపోయారు. ఇక ఐదేళ్ల పరిపాలనలో రైతులకు కేవలం 13 వేల రూపాయలు ఏడాది చొప్పున ఇచ్చి సరిపెట్టాడే కానీ పెట్టుబడి సాయంగా నష్టపరిహారాలను కూడా అందించలేదు.. దీంతో రైతుల్లో పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే ఎలా ఉంటుందో ఈసారి చూపించారు.. ఏకంగా 175 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే ప్రజల విశ్వాసాన్ని పొందాలి అంటే.. చాలా శ్రమతో కూడుకున్న పని అని.. అన్ని వర్గాల వారికి న్యాయం చేసినప్పుడే.. ప్రజల నమ్మకాన్ని పొందగలుగుతారు. ఇక ఈసారి గతంలో నమ్మకాన్ని కోల్పోయిన కూటమి.. ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: